
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకిలో దారుణం చోటుచేసుకుంది. మూడవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ ఘటన టోలిచౌకిలోని ఆజాద్ ఇంటర్ నేషనల్ స్కూల్‌లో జరిగింది. స్కూలు యాజమాన్యంలోని ఓ వ్యక్తి తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment