వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. తమ వివాహబంధం నేటితో ముగిసిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. వివరాలు.. యూసుఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలిచౌకికి చెందిన మహ్మద్ మెజిమిల్ షరీఫ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఓ పాప జన్మించిన తర్వాత కలతలు మొదలయ్యాయి. సమియాను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలన్నాడు. నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.