IPL 2022: Mohammed Siraj Shares Memorable Moment With Virat Kohli, Audio Goes Viral - Sakshi
Sakshi News home page

Mohammed Siraj- Virat Kohli: కోహ్లి టోలీచౌకీకి వచ్చాడోచ్‌..! నా జీవితంలోనే బెస్ట్‌ సర్‌ప్రైజ్‌.. భయ్యాను చూడగానే గట్టిగా హగ్‌ చేసుకున్నా!

Published Sat, Feb 19 2022 10:04 AM | Last Updated on Sat, Feb 19 2022 11:47 AM

IPL 2022: Mohammed Siraj Recalls Virat Kohli Gave Best Surprise Of Life - Sakshi

Mohammed Siraj- Virat Kohli: టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్‌కు కోహ్లి అందించిన ప్రోత్సాహం మరువలేనిది. కష్ట సమయంలో తనకు భయ్యా(కోహ్లి) అండగా నిలబడ్డాడంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! ఇక ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో కోహ్లి(15 కోట్లు)తో పాటు సిరాజ్‌ను కూడా ఆర్సీబీ రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.  పర్సు నుంచి 7 కోట్లు ఖర్చు చేసి అతడిని అట్టిపెట్టుకుంది. 

ఇక ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సిరాజ్‌ తన ఐపీఎల్‌ జ్ఞాపకాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి తనను సర్‌ప్రైజ్‌ చేశాడంటూ పాత ఘటనను గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఆర్సీబీలోని ప్రతి ఆటగాడిని ఓరోజు మా ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాను. తర్వాత హోటల్‌ నుంచి నేరుగా ఇంటికి వెళ్లాను. అయితే, నేను భయ్యాను పిలిచినపుడు.. ‘‘నాకు వెన్ను నొప్పి ఉంది మియాన్‌. నేను మీ ఇంటికి రాలేను’’ అన్నాడు. సరే.. విశ్రాంతి తీసుకో భయ్యా అని చెప్పాను. అంతకంటే నేనేం చేయగలను మరి!

ఆ తర్వాత ఒక్కొక్కరుగా మా ఇంట్లోకి వచ్చారు. పార్థివ్‌ పటేల్‌ భాయ్‌, చహల్‌ భాయ్‌ కనిపించారు. ఆ సమయంలో కోహ్లి భయ్యా కారు దిగడం చూశాను.వ వెంటనే వెళ్లి భయ్యాను హత్తుకున్నాను. నా జీవితంలో బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ అంటే ఇదే! ఎందుకంటే భయ్యా వెన్ను నొప్పి.. రాలేను అని చెప్పి మా ఇంటికి వచ్చాడు కదా!  ఇక విరాట్‌ కోహ్లి టోలీ చౌకీకి వచ్చాడన్న విషయం పెద్ద వార్త అయింది మరి!’’ అంటూ సిరాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. కాగ వీరిద్దరు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియాలో సభ్యులుగా ఉన్నారు.

ఆర్సీబీ గతంలో షేర్‌ చేసిన వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement