
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ, వారితో సీక్రెట్‌గా దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరిస్తున్న ఓ యువకుడిని బుధవారం షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన అల్తాన్ ఖాన్ తరచూ అమ్మాయిలను వేధించేవాడు. వారితో రహస్యంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అల్తాన్ ఖాన్ చర్యలకు విసుగు చెందిన ఓ అమ్మాయి షీ టీం పోలీసులను ఆశ్రయించింది. టోలీచౌకి చౌరస్తా వద్ద మాటు వేసిన పోలీసులు అల్తాన్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో అల్తాన్ ఖాన్ అరెస్టయిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment