సాక్షాత్తు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాత నియోజకవర్గమైన నరసరావుపేటలోనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి జరిగింది.
గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడటంలేదు. సాక్షాత్తు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాత నియోజకవర్గమైన నరసరావుపేటలోనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి జరిగింది. నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్యకర్తలు నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడికి పాల్పడినవాళ్లు కూడా స్పీకర్ కోడెల అనుచరులేనని బాధితులు ఆరోపిస్తున్నారు. నిండు శాసనసభలో స్పీకర్కే శాంతిభద్రతల విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెప్పుకొన్నా, ఆయన సొంత ప్రాంతంలోనే మళ్లీ అదేరోజు దాడులు జరగడం గమనార్హం.