వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌గా గానుగపంట ఉత్తమ్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ బుధవారం
వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌గా ఉత్తమ్‌రెడ్డి
Published Fri, Dec 27 2013 2:24 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM
సాక్షి, నరసరావుపేట :వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌గా గానుగపంట ఉత్తమ్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ్‌రెడ్డి అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్‌లకు ఈ సందర్భంగా ఉత్తమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లాస్థాయి పదవి అప్పగించిన పార్టీకి విధేయునిగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు.
Advertisement
Advertisement