సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి అగ్రిగోల్డ్ సమస్య ప్రజలను వేధిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ యజమాన్యం ఆస్తుల విలువ రూ.10వేల కోట్లు కాగా, ప్రజలకు చెల్లించాల్సింది రూ.7వేల కోట్లు అని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థను నారా లోకేష్‌కు అప్పజెప్పాలని టీడీపీ ఒత్తిడి చేసిందని, అగ్రిగోల్డ్ యజమాన్యం నిరాకరించడంతో..వారిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. నవంబర్ 7న గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment