victims of AgriGold
-
మాట నిలబెట్టుకున్నాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌లో డిపాజిట్ చేసి మోసపోయిన లక్షలాది మంది కష్టజీవులను ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం మోసం చేస్తే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మనందరి ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ సంస్థలో డిపాజిట్ చేసిన వారందరూ కష్టజీవులని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అండగా నిలిచామని చెప్పారు. అగ్రి గోల్డ్ వ్యవహారం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి, మిగతా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కష్టజీవులకు న్యాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చానని, అదే విషయాన్ని మేనిఫేస్టోలో కూడా పెట్టామని.. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డిపాజిట్ దారులకు న్యాయం చేశామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి బాధితుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గతంలో మిగిలిపోయిన రూ.10 వేల లోపు డిపాజిట్ దారులు మరో 3.86 లక్షల మందికి రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లను చెల్లించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి.. రూ.666.84 కోట్లను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అగ్రిగోల్డ్ బాధితులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ► ఈరోజు దేవుడి దయతో దాదాపు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది. ► గత ప్రభుత్వం 2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసింది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అడుగులు ముందుకు వేసి బాధితులకు న్యాయం చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ ఆ మొత్తం తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఈరోజుతో పూర్తి చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం ► అగ్రిగోల్డ్ స్కాం అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాం అని తేలింది. గత ప్రభుత్వంలో ఉన్న వారే అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం. ► అగ్రి గోల్డ్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దలు ఎంత సేపూ అగ్రి గోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచించారు. ఈ మల్టీ స్టేట్ స్కాం అనేక రాష్ట్రాల్లో కోర్టుల పరిధిలో విచారణలో ఉంది. కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవరు.. ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాస పెట్టాం. రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం ► గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చింది. వీరికి రూ.785 కోట్లుగా చెల్లించాలని చెప్పింది. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు.. 2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 జారీ చేసింది. కానీ రూపాయి కూడా చెల్లించలేదు. ► రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా వేగంగా అడుగులు వేస్తాం. ► మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ అండ్ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీపీ పీ వీ సునీల్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ వన్‌టౌన్‌లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు అది శ్రమ జీవుల కష్టార్జితం ► రూపాయి.. రూపాయి దాచుకుని, కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల సొమ్మే అగ్రిగోల్డ్ డబ్బు. ఇక్కడ డిపాజిట్ చేసింది లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వృత్తుల వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసి, గాలికి వదిలేసింది. ► అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి రాగానే 2019 నవంబర్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించాం. ► ఆ సమయంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) జాబితాలో మిగిలిపోయిన మరో 3,86,275 మంది రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు ఇవాళ రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులు దాదాపు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. మొత్తంగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం. రాఖీ పండగ బహుమానం అన్నా.. నేను అగ్రి గోల్డ్‌లో నెలకు రూ.500 చొప్పున రూ.11,500 జమ చేశాను. కంపెనీ మూత పడటంతో చాలా బాధపడ్డాను. చంద్రబాబుకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. రోడ్లెక్కి ధర్నాలు చేశాం. కానీ సాయం చేయలేదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా సమస్య చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో మా డబ్బు మాకు అందింది. ఈ రాఖీ పండగకు మీరు మాకు ఇచ్చిన కానుకిది. –విశాలాక్షి, కర్నూలు -
‘ఆ నివేదికను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో ప్రతి పాఠశాల రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14 నుండి నాడు-నేడు పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు. ‘అనేక పోరాటాలు చేసిన అగ్రిగోల్డ్ బాధితులను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారని’ చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. గుండ్రేవుల ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారని.. త్వరలోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజధాని పై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. రాజధాని అంశంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత నివేదిక అందిస్తుందని..దాన్నిబట్టే రాజధాని ఎక్కడ అనేది స్పష్టత వస్తుందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. -
‘అగ్రిగోల్డ్‌ను లోకేష్‌కు అప్పగించాలని చూశారు’
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి అగ్రిగోల్డ్ సమస్య ప్రజలను వేధిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ యజమాన్యం ఆస్తుల విలువ రూ.10వేల కోట్లు కాగా, ప్రజలకు చెల్లించాల్సింది రూ.7వేల కోట్లు అని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థను నారా లోకేష్‌కు అప్పజెప్పాలని టీడీపీ ఒత్తిడి చేసిందని, అగ్రిగోల్డ్ యజమాన్యం నిరాకరించడంతో..వారిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. నవంబర్ 7న గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి వెల్లడించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు మంచి రోజులు
-
తాడేపల్లిలొ ఆగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం
-
ఆపద్బాంధవుడికి కృతజ్ఞతగా..
రణస్థలం: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.265 కోట్లు విడుదల చేసిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర సమయంలో ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి చూశారు, రైతుల అకలి బాధలను తెలుసుకున్నారు, అగ్రిగోల్డ్ బాధితుల గొడును విన్నారు.. నేడు అధికారంలోని వచ్చిన అనతికాలంలోనే ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నారన్నారు. రూ.10 వేల లోపు ఉన్న డిపాజిట్లు చెల్లించడం పేదలకు శుభపరిణామని కొనియాడారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రూ.1150 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిందన్నారు. ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు నిర్వ హించామన్నారు. దీనికి బయపడిన చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు సేకరించినా.. డిపాజిట్లు చెల్లించడంలో విఫలమైయ్యా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీపీ నాయకులు పిన్నింటి సాయికుమా ర్, ఎల్.శ్రీనివాసరావు, పచ్చిగుళ్ల సాయిరాం, దన్నాన సీతారాం, ఆర్.ఎస్.రెడ్డి, జనార్దన్, జైనీ లక్ష్మణ, రెడ్డి అప్పలనాయుడు, బెండు రామరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు వి.వి.రామకృష్ణ, సి.హెచ్.శ్రీనివాసరావు, కరిమజ్జి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. మాటకు కట్టుబడిన వ్యక్తిగా.. టెక్కలి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి అని, పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు మొదట విడతగా రూ.264.99 కోట్ల నిధులను విడుదల చేశారని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం టెక్కలిలోని తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 45,833 మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ. 31,41,59,741లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పేద, సామాన్య వర్గాల ప్రజలు వారి అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసుకుంటే, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి ఆ డబ్బులను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, రాజకీయ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇందులో నాటి మంత్రి అచ్చెన్నాయుడుకు పెద్ద ఎత్తున కమీషన్లు ముట్టా యని ఆరోపించారు. జిల్లాలో రౌడీ రాజకీయాలు కింజ రాపు కుటుంబంలోనే ఆరంభమయ్యా యని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఇప్పటికైనా పారదర్శక పాలనకు సహకరించకపోతే భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా గల్లంతు కావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే ఆదుకున్నారు .. టెక్కలి: తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.264.99 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శనివారం టెక్కలి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బి.గౌరీపతి, బగాది హరి, బి.ఉదయ్, చిన్ని జోగారావు, జి.గురునాథ్ యాదవ్, కురమాన కృష్ణారావు, శంకర్, శ్యామలరావు, మదీన్, పి.రమణ, కె.నారాయణమూర్తి, ఎం.భాస్కర్, పి.వెంకటరావు, జె.జయరాం, బి.తులసీ, యర్రన్న తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో ఆగ్రిగోల్డ్ బాధితుల హర్షం
-
‘గోల్డ్’లాంటి కబురు
సాక్షి, విశాఖపట్నం నెట్వర్క్: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఎన్నికలకు ముందు ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాధితులకు హితవు పలికిన విధంగానే..పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలోనే హామీ ఇచ్చిన విధంగా రూ.10వేల లోపు డిపాజిటర్లకు న్యాయం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 13 జిల్లాల్లో రూ.10 వేలలోపు డిపాజట్లు 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. ఇందులో తొలి దశలో జిల్లా 52,005 డిపాజిటర్లకు సుమారుగా రూ.46 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న బాధితులందరిలోనూ పండగ వాతావరణం నెలకొంది. నగరంలో పలుచోట్ల సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ‘అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని చూసిన టీడీపీ నేతలు’ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు చెల్లించాల్సి ఉందని, కానీ ఆ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు అండ్ కో బృందం కుట్ర పన్నుతుందని పలువురు నాయకులు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా, వీరిలో 9 లక్షల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బాధితులు ఉన్నారు. చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం డిపాజిట్ దారులకు వేదన మిగిల్చారని, అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవాల్సిన గత ప్రభుత్వం సంస్థ ఆస్తులు కబ్జా చేసేందుకు అధిక ప్రయత్నాలు చేసిందని అన్నారు. సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం.. ఆరేళ్ల క్రితం రూ.10వేలు డిపాజిట్ చేశాను. నెలకు వెయ్యి రూపాయల చొప్పున పాలసీ కట్టాను. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు నెలల్లో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు మా కుటుంబంలో మరో రూ. 60 వేలు కూడా డిపాజిట్ చేశాం. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. –ఎ. వెంకటలక్ష్మి, హెచ్‌బీ కాలనీ. మా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే.. మా పిల్లల పేరు మీద డిపాజిట్లు చేశాం. అప్పట్లో రూ.10వేలు, రూ.10 వేలు చొప్పున రెండు పాలసీలు చేశాం. మొత్తం రూ.20 వేలు డిపాజిట్ చేశాం. డబ్బు తక్కువే కావొచ్చు కానీ. మా లాంటి పేద కుటుంబాలకు ఇదే ఆసరా. అవి కూడా పోయేసరికి చాలా బాధనిపించింది. టీడీపీ నేతలకు ఎన్నోసార్లు గత ఐదేళ్లలో మోరపెట్టుకున్నాం. నిరాశే మిగిలింది. అలాకాకుండా ఎన్నికలకు ముందు హామి ఇచ్చిన జగనన్న తన తండ్రిలాగే మాట తప్పకుండా మాలాంటి పేదలు ఎందరినో కాపాడారు. మాప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటాం. –సీహెచ్ మోహిని, వెంకోజీపాలెం. కష్టపడి సంపాదించిన డబ్బులు పోయాయి .. నేను రోజూ కూలి చేసుకున్న సంపాదనను మా పిల్లలకు ఆసరాగా ఉంటాయని నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.20 వేల రూపాయలు డిపాజిట్ చేశాను. నాకు తెలియకుండా నా భర్త కూడా నెలకు 1200 చొప్పున 12 నెలలు డిపాజిట్ చేశారు. మొత్తం పోయే సరికి చనిపోవాలనిపించింది. ఇప్పుడు జగన్ బాబు ఇస్తున్నాడని తెలిసి చాలా ఆనందంగా ఉంది. –పచ్చిపాల తవుడమ్మ, మహారాణిపేట మా ఇంట్లో సంబరాలు చేసుకున్నాం.. నేను టీ షాపు పెట్టుకుని జీవిస్తున్నాను. దానిపై వచ్చే ఆదాయం డిపాజిట్ల పేరిట రూ.60 వేలు కట్టాను. మరో పాలసీ రూ.54 వేలు కట్టాను. రెండూ పోయే సరికి నెలరోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు. మా పిల్లలు భవిష్యత్తుకు పనిచేస్తాయని డిపాజిట్ చేస్తే మోసం చేశారని బాధపడ్డాం. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేశారు. –అమర భాగ్యలక్ష్మి, మద్దిలపాలెం. సీఎంకు కృతజ్ఞతలు.. అగ్రిగోల్డ్ బాధితులకు 10వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. కష్టపడిన డబ్బులను అగ్రిగోల్డ్‌లో దాచుకోవడం జరిగింది. సంస్థ మూసివేయడంతో డబ్బులు వస్తాయో లేదా అర్థం కాలేదు. నూతన ప్రభుత్వం 10వేల లోపు ఉన్నవారికి చెల్లించేందుకు చర్యలు చేపట్టడం సంతోషంగా ఉంది. –మన్నా వీరస్వామి, అనంతగిరి -
16 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య వాయిదా పడుతుందే కానీ పరిస్కారం కావడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు అన్నారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వ న్యాయవాదులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలపై లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్నబాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన తరువాత కూడా 35 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులందరికీ ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.