
సాక్షి, గుంటూరు: సచివాలయ పరీక్షలను సైతం రాజకీయం చేస్తున్నారని చంద్రబాబుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నిజంగానే ప్రశ్నాపత్రం లీకైతే ఆ రోజే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీ మహిళకు ర్యాంకు వస్తే.. పేపర్ లీకు అంటారా అని దుయ్యబట్టారు.టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఏనాడయినా ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.సచివాలయ పరీక్షలను రాజకీయ కోణంలో చూసి.. నీచ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 58 కోట్లు ఆదా అయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment