
కోడెల స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 'డీమార్ట్' నిర్మాణం కోసం..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కోడెల స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 'డీమార్ట్' నిర్మాణం కోసం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు అడిగిన లారీ ఓనర్లను బెదిరిస్తున్నారని చెప్పారు.
రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అపార్ట్‌మెంట్ కట్టుకోవాలంటే ఒక్కో ప్లాట్‌కు 50వేలు లంచం అడుగుతున్నారని తెలిపారు. సొంత పార్టీలో ఉండేవారిని సైతం కోడెల కుమారుడు వదలటం లేదన్నారు. వీరి అక్రమాలకు జనం ఓట్ల రూపంలోనే సమధానం చెప్తారని అన్నారు.