సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం రాష్ట్రవ్యాప‍్తంగా అన్ని జిల్లాలోనూ కొనసాగుతోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు టీడీపీ అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై 4,356 ఓట్ల ఆధిక్యంతో గెలుపు బావుటా ఎగురవేయనున్నారు. మొత్తం 150కిపైగా స్థానాల్లో ఫ్యాన్ జోరు సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 23స్థానాల్లోనూ టీడీపీకి ఎదురు దెబ్బే.
గుంటూరు జిల్లా వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులుపై 7,552 ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. గురజాలలో వైసీపీనేత కాసు మహేశ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి యరపతినేనిపై 206 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. అలాగే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 5,345 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మొత్తంగా జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment