ఒంగోలు: గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ నుంచి గురువారం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన ఈనెల 21 నుంచి ఈ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.