
సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ రాష్ట్ర కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం చేయమని ధర్నా చేస్తే చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనవసర ఆర్భాటాలకు చేసే ఖర్చును బాధితులకు ఇస్తే వారి సమస్యలు కొన్నైనా తీరేవన్నారు. అగ్రిగోల్డ్ యజమానులను మంత్రి లోకేష్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే..140 మందికి మాత్రమే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment