
సాక్షి, తాడేపల్లి: ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంట్ తీగలు మీద బట్టలు అరేసుకోవాలన్నారని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామంటే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ కోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు సంక్షేమం కోరే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజల కోసం కాకుండా అవినీతి, హత్య కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లడం సిగ్గు చేటన్నారు. చదవండి: (రైతులకు అందే విద్యుత్ ఉచితమే: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment