lella appireddy
-
బెదిరించి.. భయపెట్టి.. ‘కూటమి’ ప్రలోభాలు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రలోభాలకు లొంగకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంటిని కూల్చేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి. రాజీనామా చేసి వచ్చిన వారినే పార్టీలో చేర్చుకుంటానని చంద్రబాబు చెబుతున్నాడు. స్థానిక సంస్థలకు ఆ సిద్ధాంతాలు వర్తించవా చంద్రబాబు?. ఎందుకు దొడ్డిదారిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలను లాక్కుంటున్నారు. కూటమి నేతలకు అధికార దాహం తీరలేదు. ప్రజల గొంతును వినిపించకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. మీకు బలం లేనప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు: మల్లాది విష్ణుబలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి కూటమి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలుపెట్టిన ప్రలోభాలను నేటికీ టీడీపీ కొనసాగిస్తోంది. బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఓటేసే అవకాశం ఇవ్వాలని.. భద్రత కల్పించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరాం. పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మా కార్పొరేటర్లు,కౌన్సిలర్లకు భద్రత లేకుండా పోయింది. కూటమి దుష్ట ఆలోచనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.భయపెట్టి దాడులు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది: అవినాష్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు భయపెడుతున్నారు. భయపెట్టి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది. పార్టీ మారకపోతే రాత్రికి రాత్రి అభ్యర్థుల ఇళ్ల పై జేసీబీలతో దాడులు చేస్తున్నారు.ఇదీ చదవండి: టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్సఅలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు: మేయర్ రాయన భాగ్యలక్ష్మిరాజకీయ భిక్ష పెట్టిన నాయకులను కాదని కొందరు పార్టీలు మారుతున్నారు. అలాంటి వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారు. కూటమి ప్రభుత్వం భయపెట్టి.. ప్రలోభపెట్టి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. ఒక సింబల్ మీద గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం సరికాదునిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి: ఎమ్మెల్సీ,లేళ్ల అప్పిరెడ్డిరేపు 10 చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. సంఖ్యా పరంగా ఎక్కడా టీడీపీ గెలిచే అవకాశం లేదు. సంఖ్యాపరంగా బలం లేనప్పుడు ప్రలోభాలు పెట్టడం దేనికి. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చింది. మీపార్టీ వైపు లొంగకపోతే ఇళ్లు కూలగొడతారా.. దాడులు చేస్తారా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటే ఇదేనా చంద్రబాబు?. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలిమీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?: అంబటి రాంబాబుతిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాల పై ఎన్నికల కమిషన్‌ను కలిశాం. శేఖర్ రెడ్డిని మేం డిప్యూటీ మేయర్‌గా ప్రకటించాం. శేఖర్ రెడ్డిని కూటమి నేతలు బెదిరించారు. శేఖర్ రెడ్డి బిల్డింగ్‌ను దుర్మార్గంగా కూల్చేశారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు అనేక మార్లు చెప్పారు. కార్పొరేటర్ల విషయంలో మీరు చెప్పిన మాట మీకు వర్తించదా చంద్రబాబు?. మా పార్టీలో గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికి విప్ జారీ చేశాం. -
విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న ఫీజు పోరు (YSRCP Fees Poru) నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫీజు పోరు చేస్తామని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కల్గిస్తున్నాయని.. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తోందని అప్పిరెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా సమాజానికి మేలు చేకూరే పని చేయరు. పేద విద్యార్థులకు ఏ ప్రయోజనం చేకూర్చరు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని 2004లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. ఆయన వలనే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారు. కానీ చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రూ.18 వేల కోట్లను విద్యా రంగానికి ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఆలస్యం కాకుండా నిధులను విడుదల చేశారు. చంద్రబాబు మాత్రం ఇప్పటికే 3,900కోట్లు బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతూ విద్యారంగాన్ని విస్మరించారు. బకాయిలను చెల్లించాలని కోరుతూ కలెక్టర్లను కలవబోతున్నాం. రూ.3,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలపడలేదని చంద్రబాబు గుర్తించాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: దటీజ్ జగన్..పగవాడైనా ఒప్పుకోవాల్సిందే! -
వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు రక్షణ
సాక్షి,అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో తమకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌లపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.దర్యాప్తునకు సహకరించాలని అప్పిరెడ్డి తదితరులను ఆదేశించింది. 48 గంటల్లో పిటిషనర్లందరూ తమ పాస్‌పోర్ట్‌లను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ తమ తమ వాదనలను వినిపించారు. జోగి రమేష్‌పైనా కఠిన చర్యలొద్దుఅలాగే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు సైతం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రమేష్‌పై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
-
బాబు మాటలే... పీకే నోట
సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుకుతున్న పలుకులన్నీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులేనని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలనే ఆయన వల్లిస్తుండటాన్ని బట్టి అవన్నీ కిరాయి పలుకులు, కిరాయి ప్రకటనలేనని స్పష్టమవుతోందన్నారు. గతంలో పార్టీలకు వ్యూహకర్తగా డబ్బులు తీసుకున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఒక్కో స్టేట్మెంట్కు లెక్కగట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ పేర్కొనటాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన బిహార్‌లో రాజకీయ అరంగేట్రంతో పాదయాత్ర చేశారన్నారు. అయితే బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ డీల్ కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు. లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్‌ను వెంటబెట్టుకుని ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబుతో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ప్రశాంత్ కిశోర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నామని ఐ–ప్యాక్ ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సర్వే చేసేందుకు అవసరమైన వ్యవస్థ ప్రశాంత్ కిశోర్‌కు లేదన్నది తద్వారా స్పష్టమవుతోందన్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందన్నారు. టైమ్స్‌నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని వెల్లడవడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం సముద్రంలా పోటెత్తారని, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులే విశ్లేషించారన్నారు. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాలు తేలాక తాడేపల్లిగూడెంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఆందోళన చెందుతున్న చంద్రబాబు టీడీపీ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రశాంత్ కిశోర్‌తో తనకు అలవాటైన రీతిలో అబద్ధాలను మాట్లాడిస్తున్నారంటూ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. -
నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
తెలంగాణను దోచుకున్నారు.. హరీష్‌పై ఎమ్మెల్సి అప్పిరెడ్డి ఫైర్
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సి లేళ్ల ఎమ్మెల్సి ఫైరయ్యారు. హరీష్ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ గురించి హరీష్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. అల్లుడు, కూతురు, అందరూ కలిసి తెలంగాణను దోచుకున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ఎమ్మల్సీ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఏం తెలుసని హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా?. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ములేక ఏపీ గురించి మాట్లాడుతున్నారు. అల్లుడు, కూతురు, అందరూ కలిసి తెలంగాణను దోచుకున్నారు. చినుకు పడితే హైదరాబాద్ రోడ్లపై పడవలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌ను బాగుచేసుకోలేనివారు మా గురించి మాట్లాడటమేంటి?. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారు. మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘హరీష్ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో’ -
గిరి బిడ్డలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
సాక్షి,అమరావతి : గిరిజనులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, వారి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. వివిధ పథకాల కింద రూ.15,589.38 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గిరిజన విభాగం సమావేశం నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాల పురోగతితోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. 1.38 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చారని, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు మేరాజోత్ హనుమంత్ నాయక్, మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
-
అగ్రి గోల్డ్ బాధితులకి అండగా వైఎస్సార్సీపీ:లేళ్ల అప్పిరెడ్డి
-
వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయండి
సాక్షి, అమరావతి : ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంటూరు జిల్లా పొన్నూరు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిదేవిని టీడీపీ సీనియర్ నేతలు మల్లికార్జున, ఉన్నం మారుతీచౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి బెదిరించారు. కొండాపురం ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని ఎస్ఈసీ రద్దు చేయాలి. 45 ఏళ్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామనూరులో బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. బీసీ రిజర్వ్డ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ కరీమూన్‌ను వరదరాజులరెడ్డి బెదిరిస్తున్నారు. షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. -
సీఎం రిలీఫ్ ఫండ్‌పై చంద్రజ్యోతి విషపు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని విస్తరించి పేదలకు మంచి వైద్యం అందేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషం చిమ్మడం దారుణం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఆరోగ్య శ్రీని పూర్తిగా నిరీ్వర్యం చేయడం ఆనాడు రాధాకృష్ణకు కన్పించలేదా అని ప్రశ్నించారు. నిరుపేదల నిధికి సర్కారు గ్రహణం అంటూ ఆంధ్రజ్యోతి రాసిన అవాస్తవ రాతలపై ఆదివారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు రూ.680 కోట్లు బకాయిలు పెట్టిపోతే వైఎస్ జగన్ సీఎం అయ్యాక చెల్లించిన విషయం జగమెరిగిన సత్యం అన్నారు. ఈ విషయం రాధాకృష్ణకు తెలియకపోవటం ఆశ్చర్యకరం అన్నారు. ఆరోగ్యశ్రీకి ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతో పాటు, జబ్బుల సంఖ్యను 2,434కు పెంచడం విప్లవాత్మక నిర్ణయం అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు మాత్రమే సీఎం సహాయ నిధికి రిఫర్ చేయాలని ఎమ్మెల్యేలకు సూచించడంలో తప్పేముందని నిలదీశారు. -
విద్యుత్ సంస్కరణల్లో టీడీపీ రాద్ధాంతం
సాక్షి, తాడేపల్లి: ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంట్ తీగలు మీద బట్టలు అరేసుకోవాలన్నారని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామంటే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ కోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు సంక్షేమం కోరే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజల కోసం కాకుండా అవినీతి, హత్య కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లడం సిగ్గు చేటన్నారు. చదవండి: (రైతులకు అందే విద్యుత్ ఉచితమే: సీఎం జగన్) -
తాడేపల్లిలొ ఆగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం
-
వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు
-
సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల హామీ అమలులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో రూ.270 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 3లక్షల 70వేలమందికి లబ్ది చేకూరుతుంది. చంద్రబాబు నాయుడుకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన రాలేదు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేశారు. గత ప్రభుత్వం కమిటీలు వేసి కాలక్షేపం చేసింది. చంద్రబాబు తీరు వల్ల 300మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా చిన్న చిన్న కుటుంబాలకు చెందినవారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం చేయాలని సీఎం ముందుకు వచ్చారు. రూ.10 వేల నుంచి రూ.20వేలు లోపు డబ్బులు కట్టిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు అందరికీ డబ్బులు చెల్లిస్తాం. దీనివల్ల మరో పది లక్షల మంది బాధితులకు లబ్ధి చేకూరుతుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నాయకులు దోచుకున్నారు. ఆస్తులను దోచుకున్నవారికి శిక్ష తప్పదు.అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌లాండ్‌ను నారా లోకేశ్ కాజేయాలని చూశారు. ఇంకా టీడీపీ నేతల చేతుల్లోనే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం. చదవండి: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల -
గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు
-
చంద్రబాబు గుట్టురట్టు..మరో సాక్ష్యం
-
వారిని లోకేషే కాపాడుతున్నారు : గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ రాష్ట్ర కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం చేయమని ధర్నా చేస్తే చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనవసర ఆర్భాటాలకు చేసే ఖర్చును బాధితులకు ఇస్తే వారి సమస్యలు కొన్నైనా తీరేవన్నారు. అగ్రిగోల్డ్ యజమానులను మంత్రి లోకేష్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే..140 మందికి మాత్రమే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఇది దౌర్భాగ్యపు ప్రభుత్వం : అప్పిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. బాధితులకు అండగా తమ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్ప చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ ప్రతి డిపాజిట్ దారునికి అంచెలంచెలుగా పరిహారం చెల్లిస్తామని అని కుటుంబరావు చెబుతున్నారు. కోర్టుకు చూపించని ఆస్తులకు సంబంధించి ఆయన ఈ నెల 8వ తేదీన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతీ లేదు. ఈ కేసులో సీబీసీఐడి దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగింది’ అని ఆరోపించారు. ఇంతటి దౌర్భాగ్యమా? అగ్రిగోల్డ్ కేసులో కొన్ని ఆస్తులను మాత్రమే కోర్టుకు చూపించి, మిగిలిన ఆస్తులను దోచుకోవాలని చూస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వమిదని అప్పిరెడ్డి మండిపడ్డారు. బాధితుల సంఖ్య, వివరాలు, డిపాజిట్ తదితర వివరాలను చెప్పకుండా, అగ్రిగోల్డ్‌కు సంబంధించి వివరాలు ఆన్లైన్లో పెట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధితులకు ప్రస్తుతం 80 శాతం అంటే రూ.1180 కోట్లు, మిగిలిన 20 శాతం బాండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెల్ల కాలంలో తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గాల స్థాయిలో ఈనెల 18న సమావేశాలు నిర్వహించి, బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతామని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వంపై ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. -
అగ్రిగోల్డ్‌పై పోరాటానికి ఇక సిద్ధం : అప్పిరెడ్డి
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతం చేస్తున్నదని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..జనవరి 3న 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. రేపు విశాఖపట్నంలో4 జిల్లాల బాసట కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు. 30న విజయవాడలో కృష్ణా , గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల బాధితుల బాసట కమిటీ సమావేశం, 31న నెల్లూరులో, జనవరి 2న అనంతపురంలో బాధితుల బాసట కమిటీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. నియోజకవర్గాల బాసట కమిటీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు. -
లేళ్ల అప్పిరెడ్డి హౌస్ అరెస్ట్
-
డయేరియా మృతులు సర్కారీ హత్యలే
-
‘ఏపీ ప్రభుత్వ మెడలు వంచుతాం’
సాక్షి, విజయవాడ : కొత్త చట్టం తెస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టం పేరుతో నిబంధనల పేరుతో కాలయాపన చేయొద్దని హితవు పలికారు. వెంటనే బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల వివరాలను వెబ్సైట్లో పెట్టాలని అన్నారు. బాధితులు ఎవరూ మానసిక ఒత్తిడికి గురి కావొద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ మెడలు వంచి ప్రతి రూపాయిని తిరిగి బాధితులకు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అన్నిజిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ పర్యటిస్తుందని వెల్లడించారు. అగ్రిగోల్డ్ సమస్యపై వైఎస్ జగన్ స్పందించిన ప్రతిసారీ ప్రభుత్వంలో కదలిక వస్తోందని చెప్పారు. అయితే, వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ సమస్యపై గళమెత్తిన ప్రతిసారీ కొత్త అంకాన్ని తెరమీదకు తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు సర్కారు వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. -
‘అగ్రిగోల్డ్’పై ప్రభుత్వ ఉదాశీనతను సహించం: లేళ్ల
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ వంచితులైన 20లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారని, ఈ విషయంలో ప్రభుత్వ ఉదాశీనతను సహించేది లేదని స్పష్టం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలోను పలువురు బాధితులు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసు కుంటున్నారన్నారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని విజయవాడలో ఈనెల 20న(శనివారం) నిర్వహిస్తున్నామని చెప్పారు. బాధితుల కోసం పనిచేసే అందరినీ కలుపుకుని వారికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. బాధితుల్లో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఏడు నెలల కిందట జి.ఓ జారీ చేసినా నేటికీ పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం రూ.1200 కోట్లు చెల్లించి 14లక్షల మందికి ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అప్పిరెడ్డి అన్నారు. -
‘టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు’
-
‘టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు’
నంద్యాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నంద్యాల నిర్వహిస్తున్న బహిరంగ సభ చరిత్రకు సాక్షంగా నిలవబోతుందని వైఎస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నంద్యాల ఉప ఎన్నికలు పునాది కానున్నాయని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం టీడీపీ నేతల అబ్బల తరం కూడా కాదని మండిపడ్డారు. -
వారికి మంత్రి పదవులు సిగ్గుచేటు
► ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ► దమ్ముంటే రాజీనామా చేయించి, గెలిపించి పదవులు కట్టబెట్టు ► వైఎస్సార్ సీపీ నేతలు అప్పిరెడ్డి, మేరుగ సవాల్ పట్నంబజారు: ‘నోరు తెరిస్తే నిప్పునంటాడు..నీతి నిజాయితీలకు నిలువుటద్దాన్ని అని చెబుతాడు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి..రాజ్యాంగానికి..ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ.. ఆదివారం నల్ల రిబ్బన్లు ధరించి అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయం నుంచి లాడ్జిసెంటర్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందన్నారు. అసలు ఎటువంటి పాలన రాష్ట్రంలో సాగుతోందో అర్థం కాని దుస్థితి దాపురిచిందని ధ్వజమెత్తారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక పాలనకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన పేరును దగా బాబుగా మార్చుకుంటే బాగుంటుందని దుయ్యబట్టారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పటం తథ్యమని హెచ్చరించారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. నాడు గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, ఈ రోజు ఆయన తో రాజ్యాంగానికి తూట్లు పొడిపించారని మండిపడ్డారు. సిగ్గు, ఎగ్గు లేకుండా రాష్ట్రంలో నీఛ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. కేవలం లోకేషన్‌ను మంత్రిని చేయడం కోసమే విస్తరణ పేరుతో నీచ రాజకీయానికి పాల్పడ్డారని, లోకేష్‌తోపాటు పదవి ఎరవేసి వైఎస్సార్సీపీ నుంచి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు కొంతమందికి పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. నాడు తెలంగాణలో కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నంది ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పలు విభాగాల నేతలు గనిక ఝాన్సీరాణి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, సోమికమల్, మేరువ నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, షేక్ గౌస్, దాసరి కిరణ్, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పల్లపు మహేష్, అందుగల రమేష్, దేవానంద్, సైదాఖాన్, దూపాటి సాల్మన్, హసన్బుజ్జి, షంషేర్, జ్యోతి, శివపార్వతి, సుబ్బారెడ్డి, మన్నేపల్లి బాబు, విఠల్, బాజీ, షేక్ సుబ్నా, సాయి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు పాలించే అర్హత లేదు
గడప గడపకు వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నెహ్రూనగర్: వ్యాపార, వర్తక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ తదితర వర్గాలను దారుణంగా దెబ్బతీస్తున్న చంద్రబాబు సర్కారుకు పాలించే అర్హత లేదని వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం సోమవారం 39వ డివిజన్ బ్రాడీపేట డివిజన్ అధ్యక్షుడు మొక్కపాటి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపార వర్గాలపై పన్నుల భారం మోపే ముందు ముందస్తూ సమాచారం, నిర్ణీత గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పన్నుల భారం మోపడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందన్నారు. రాత్రిపూట జీవోలు విడుదల చేయడం, అర్ధరాత్రి దేవాలయాలు, వైఎస్సార్ విగ్రహాలు అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చీకటి పాలనకే అధిక ప్రాధాన్యతనిస్తుందని మండిపడ్డారు. గతంలో రైతుల ఆత్మహత్యలే చూశామని ప్రసుత చంద్రబాబు రెండేళ్ళ పాలనలో వ్యాపారులపై మోపుతున్న పన్నుల భారంతో ప్రభుత్వమే వ్యాపారులను ఆ దారిలో నెట్టాలను చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులే అధికారులతో వ్యాపారులను బెదిరించి భయాభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు కోకొల్లలని అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార వర్గాల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో వ్యాపార వర్గాల సత్తా ఏమిటో చూపించేందుంకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
'అలా పనిచేయడం కరెక్టు కాదు'
గుంటూరు: పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం కరెక్టు కాదని వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. న్యాయన్యాయాల గురించి తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందేమోనని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో గురువారం చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. -
ఆ నిందితులను బహిష్కరించాలి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి మృతి కారణమైన వారిని వెంటనే కాలేజీ నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రిషికేశ్వరి మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. -
రోడ్డున పడేస్తున్నారు
గుంటూరు: భజరంగ్ జూట్ మిల్లును మూసేందుకు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అపార్ట్ మెంట్లు, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం పేరుతో పరిశ్రమ స్థలాలను రియల్ ఎస్టేట్ వారికి అప్పగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా స్థలాలను అమ్మేశారని చెప్పారు. అక్రమాలు ఆపకపోతే కార్మికులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు