‘టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు’
నంద్యాల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల నిర్వహిస్తున్న బహిరంగ సభ చరిత్రకు సాక్షంగా నిలవబోతుందని వైఎస్‌ఆర్ సీపీ గుంటూరు జిల్లా అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నంద్యాల ఉప ఎన్నికలు పునాది కానున్నాయని అన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం టీడీపీ నేతల అబ్బల తరం కూడా కాదని మండిపడ్డారు.