సాక్షి,అమరావతి : గిరిజనులపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, వారి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. వివిధ పథకాల కింద రూ.15,589.38 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గిరిజన విభాగం సమావేశం నిర్వహించారు.
అప్పిరెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాల పురోగతితోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. 1.38 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చారని, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు మేరాజోత్ హనుమంత్ నాయక్, మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment