సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ వంచితులైన 20లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారని, ఈ విషయంలో ప్రభుత్వ ఉదాశీనతను సహించేది లేదని స్పష్టం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలోను పలువురు బాధితులు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసు కుంటున్నారన్నారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని విజయవాడలో ఈనెల 20న(శనివారం) నిర్వహిస్తున్నామని చెప్పారు. బాధితుల కోసం పనిచేసే అందరినీ కలుపుకుని వారికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. బాధితుల్లో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఏడు నెలల కిందట జి.ఓ జారీ చేసినా నేటికీ పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ప్రభుత్వం రూ.1200 కోట్లు చెల్లించి 14లక్షల మందికి ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అప్పిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment