
'అలా పనిచేయడం కరెక్టు కాదు'
గుంటూరు: పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం కరెక్టు కాదని వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. న్యాయన్యాయాల గురించి తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందేమోనని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో గురువారం చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.