YSRCP MLC Lella Appireddy Political Counter Attack On TS Minister Harish Rao - Sakshi
Sakshi News home page

కుటుంబమంతా కలిసి తెలంగాణను దోచుకున్నారు.. హరీష్‌పై ఎమ్మెల్సి అప్పిరెడ్డి ఫైర్‌

Published Wed, Apr 12 2023 5:24 PM | Last Updated on Wed, Apr 12 2023 5:43 PM

Lella Appireddy Political Counter Attack On Harish Rao - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సి లేళ్ల ఎమ్మెల్సి ఫైరయ్యారు. హరీష్‌ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ గురించి హరీష్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. అల్లుడు,  కూతురు, అందరూ  కలిసి తెలంగాణను దోచుకున్నారు అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 

​కాగా, ఎమ్మల్సీ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఏం తెలుసని హరీష్‌ రావు మాట్లాడుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా?. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ములేక ఏపీ గురించి మాట్లాడుతున్నారు.  అల్లుడు,  కూతురు, అందరూ  కలిసి తెలంగాణను దోచుకున్నారు. చినుకు పడితే హైదరాబాద్‌ రోడ్లపై పడవలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌ను బాగుచేసుకోలేనివారు మా గురించి మాట్లాడటమేంటి?. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారు. మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ‘హరీష్‌ రావు.. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకో’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement