
లేళ్ల అప్పిరెడ్డి
ఉభయగోదావరి జిల్లాల బాధితుల బాసట కమిటీ సమావేశం..
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతం చేస్తున్నదని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..జనవరి 3న 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. రేపు విశాఖపట్నంలో4 జిల్లాల బాసట కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు.
30న విజయవాడలో కృష్ణా , గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల బాధితుల బాసట కమిటీ సమావేశం, 31న నెల్లూరులో, జనవరి 2న అనంతపురంలో బాధితుల బాసట కమిటీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. నియోజకవర్గాల బాసట కమిటీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.