బాబుకు పాలించే అర్హత లేదు
Published Mon, Aug 1 2016 9:09 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
గడప గడపకు వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
లేళ్ళ అప్పిరెడ్డి
నెహ్రూనగర్: వ్యాపార, వర్తక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ తదితర వర్గాలను దారుణంగా దెబ్బతీస్తున్న చంద్రబాబు సర్కారుకు పాలించే అర్హత లేదని వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం సోమవారం 39వ డివిజన్ బ్రాడీపేట డివిజన్ అధ్యక్షుడు మొక్కపాటి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపార వర్గాలపై పన్నుల భారం మోపే ముందు ముందస్తూ సమాచారం, నిర్ణీత గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పన్నుల భారం మోపడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందన్నారు. రాత్రిపూట జీవోలు విడుదల చేయడం, అర్ధరాత్రి దేవాలయాలు, వైఎస్సార్ విగ్రహాలు అడ్డగోలుగా తొలగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చీకటి పాలనకే అధిక ప్రాధాన్యతనిస్తుందని మండిపడ్డారు. గతంలో రైతుల ఆత్మహత్యలే చూశామని ప్రసుత చంద్రబాబు రెండేళ్ళ పాలనలో వ్యాపారులపై మోపుతున్న పన్నుల భారంతో ప్రభుత్వమే వ్యాపారులను ఆ దారిలో నెట్టాలను చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులే అధికారులతో వ్యాపారులను బెదిరించి భయాభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు కోకొల్లలని అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార వర్గాల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో వ్యాపార వర్గాల సత్తా ఏమిటో చూపించేందుంకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Advertisement
Advertisement