'అక్కడ గెలిచి... ఇక్కడ పెత్తనం ఏంటి' | YSRCP guntur leaders complaints against speaker kodela | Sakshi
Sakshi News home page

'అక్కడ గెలిచి... ఇక్కడ పెత్తనం ఏంటి'

Published Sun, Dec 13 2015 5:52 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

'అక్కడ గెలిచి... ఇక్కడ పెత్తనం ఏంటి' - Sakshi

'అక్కడ గెలిచి... ఇక్కడ పెత్తనం ఏంటి'

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలలో టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా కన్వినర్ మర్రి రాజశేఖర్, తదితర నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.

తన కుమారుడిని జనానికి పరిచయం చేసేందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ ఉత్సవాలను చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు వివరించారు. సత్తెనపల్లిలో గెలిచిన కోడెల.. నరసారావుపేటలో పెత్తనం చేయడం ఏంటి అని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement