marri rajashekar
-
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే... దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసారథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా అమలవుతుంది. -
నాకు పార్టీ ముఖ్యం.. సీఎం జగన్‌కు నా కృతజ్ఞతలు
-
మా ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవు : మర్రి రాజశేఖర్ రెడ్డి
-
పేటలో కొత్తవారికే అందలం
సాక్షి, చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గం 2004 వరకు ఎన్నికల ఫలితాల్లో నూతన విశిష్టత చాటుకునేది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కొత్తగా పోటీ చేసే వారికే అనుకూలంగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి సారి పొటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన కరణం రంగారావు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పి.నాగయ్యపై గెలిచారు. పదేళ్ల పాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్టూరులోకి వెళ్లింది. తిరిగి 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి కందిమళ్ల బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసిన కందిమళ్ల బుచ్చయ్యపై తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బాల సత్యనారాయణ గెలిచారు. 1978లో తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్య, జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కాజా కృష్ణమూర్తి రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆ తదుపరి జరిగిన రెండు ఎన్నికల్లో మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుతం 2019లో టీడీపీ తరుఫున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజని బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తొలిసారి పోటీ చేసిన అభ్యర్థులకే అండగా నిలుస్తున్న నియోజకవర్గం సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, రజనికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఏపీ మంత్రి పుల్లారావువి హత్యా రాజకీయాలు
-
15 నుంచి గడపగడపకూ వైఎస్సార్
పిడుగురాళ్ల పట్టణం నుంచి ప్రారంభం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు (గుంటూరు): ఈ నెల 15వ తేదీన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని 29, 30 వార్డులో నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన కాసు మహేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తితో కలిసి గడప, గడపకూ వైఎస్సార్ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ జరుగుతోందన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మా దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గడపగడపకూ వైఎస్సార్ జరుగుతోందని పేర్కొన్నారు. కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లేలా..ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 15న ప్రారంభం కానున్న కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్యఅతిథులు రానున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పలువురు జెడ్పీటీసీలు, నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పాలకులే దోపిడీదారులు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వినుకొండ టౌన్: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులే దోపిడీదారులుగా వ్యవహరించడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. కాసు మహేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికను పురష్కరించుకొని జనసమీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల సొమ్మును లూఠీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ దోపిడీ చేసిన సొమ్మును అణాపైసలతో సహా వసూలు చేయడం ఖాయమంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. వ్యాపార ముసుగులో అడ్డగోలుగా సంపాదించిన జీవి ఆంజనేయులుకు జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. చరిత్రలో రాజన్న పాలనకు ముందు, రాజన్న పాలన తరువాత అన్న ముద్ర పడిందని, నాటి రామ పాలన మరలా తిరిగి రాష్ట్రంలో నెలకొనాలంటే జగనన్న వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార పార్టీ తుంగలో తొక్కడంతో పేదలు, బడుగులు, బలహీనవర్గాలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాసు మహేష్ రెడ్డి చేరికతో పల్నాడులో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. మహేష్ రెడ్డి పార్టీలో చేరిక సభకు లక్షలాదిమంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో వందల హామీలు గుప్పించిన టీడీపీ పార్టీ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశం జరుగుతున్నంత సేపు యువత ఈలలు, కేరింతలతో తమ మద్దతును వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా యువత అధ్యక్షులు డైమండ్ బాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, బీసీ సెల్ కన్వీనర్ సునీల్, మైనార్టీ సెల్ ముస్తఫా, పట్టణ,మండల కన్వీనర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
'నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమమే'
గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రబీకి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, నీరు లేక పంట భూములన్నీ బీడులుగా మారిపోతున్నాయని నేతలు మండిపడ్డారు. మంచినీళ్ల చెరువులు కూడా ఎండిపోతున్నాయని అందుచేత వెంటనే సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. -
సదావర్తి భూములు బినామీలకు కట్టబెట్టేందుకే..
నిబంధనల పేరుతో ప్రభుత్వం నాటకాలు గత వేలం రద్దు చేసి కొత్త వేలం నిర్వహించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చిలకలూరిపేటటౌన్: సదావర్తి భూముల విషయంలో తొలి నుంచి సీఎం చంద్రబాబునాయుడు తన బినామీలకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో మాట్లాడుతూ ఈ భూములకు ఐదు కోట్లు ఎక్కువిస్తే వారికి భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు కూడా కొన్నదాని కన్నా రెండు కోట్లు ఎక్కువిస్తే భూమి ఇచ్చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ ఈ భూములకు రూ. 5 కోట్లు ఎక్కువిస్తామని ముందుకొస్తే అలవిమాలిన నిబంధనలు విధిస్తున్నారని విమర్శించారు. పీఎల్ఆర్ ప్రాజెక్టు వారు వారంలోగా రూ. 28 కోట్లు డిపాజిట్ చేయాలని, 60 రోజుల తరువాత వేలం నిర్వహిస్తామని, రిజిస్ట్రేషన్ చేయమని, కేవలం సేల్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తామని మెలికలు పెట్టడం చూస్తే కేవలం అయిన వారికి భూములు కట్టబెట్టేందుకే నాటకాలు ఆడుతున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. కారు చౌకగా భూములు కొట్టేసిన వారికి రూ. 11 కోట్లు చెల్లించటానికి 90 రోజుల సమయం ఇచ్చారని, అధిక ధరకు కొంటామని వచ్చిన వారికి వారం రోజుల్లో yì పాజిట్ చెల్లించాలని నిబంధన విధించడమేమిటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఈ భూముల విలువ ఎకరం ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారని. గత ఒప్పందాన్ని రద్దు చేయటానికి ఇంతకన్నా ఏ ఆధారం కావాలని ప్రశ్నించారు. ఇంకా ఎకరా కేవలం రూ. 27 లక్షలకే భూములను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తక్షణమే గత వేలాన్ని రద్దు చేయించి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. అర్హత లేని ఈవోను అమరలింగేశ్వరస్వామి గుడికి వేసి వేలం నిర్వహించటం కుట్రతో కూడుకున్న వ్యవహారం కాదా అని ప్రశ్నించారు. -
పుష్కర పనుల్లో దోపిడీ
పుష్కర పనులు నాసిరకంగా సాగుతున్నాయని, అధికార పార్టీ నేతల దోపిడీకి మారుపేరుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ధరణికోట, అమరావతి, సీతానగరంలో ఘాట్లను పార్టీ నాయకులు అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమస్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క్రిస్టినా, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్‌లతో కలిసి వారు పరిశీలించారు. ఘాట్లలో జరుగుతన్న పనుల తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పనుల్లో సాంకేతికపరమైన అంశాలు,నాణ్యతపై ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నలవర్షం కురిపిస్తుంటే.. అధికారులు నీళ్లు నమిలారు. ధరణికోటలో 350 మీటర్ల మేర ఘాట్ పనులు దాదాపు రూ. 10 కోట్లతో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేయాల్సిఉండగా.. కనీసం 0.2 మీటర్ల మందం కూడా వేయడం లేదని, ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ జరుగుతున్న పనులేనన్నారు. కాంక్రీట్‌కు ముందు ఇసుక వేసి చదును చేసేటప్పుడు పిన్ వైబ్రేటర్ వాడాలి. కాంక్రీట్ వేసేటప్పుడు ప్యాన్ వైబ్రేటర్ ఉపయోగించాలి. అవేమీ ఇక్కడ కనిపించలేదన్నారు. బెడ్‌కు వాడే కాంక్రీట్‌కు 40 ఎంఎం కంకర బదులు అన్‌సైజు 3/4 కంకర వాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ నదిలో ఉన్న ఇసుకను వినియోగిస్తూ.. క్యూబిక్ మీటరుకు రూ. 250 వంతున దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. పనుల్లో వాడుతున్న స్టీల్‌కు టెస్టింగ్ సర్టిఫికెట్లు అడిగితే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టింగ్ క్యూబ్ గురించి అధికారులు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. పుష్కరాల తేదీలు ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 10న పనులు ప్రారంభించి హడావుడి చేయడమేమిటని వారు ప్రశ్నించారు. గడువు మేరకు ఈ నెలాఖరుకు పనులు కాకపోతే కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కుట్ర జరుగుతుందన్నారు. జేబులు నింపుకోవడానికే.. పుష్కర పనులను సైతం సీఎం చంద్రబాబునాయుడు, చినబాబు , స్థానిక అధికార పార్టీ నేతలు వదలటం లేదన్నారు. పనులు నాసిరకంగా చేసి వాటాలు పంచుకొంటున్నారని ఆరోపించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తే భక్తుల కోసమా, జేబులు నింపుకోవటానికా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత పాటించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఏపీ అగ్రస్థానంలో ఉందని జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. నంబరు 1 సీఎం అని గొప్పలు చెప్పుకొనే బాబు అవినీతి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
'అక్కడ గెలిచి... ఇక్కడ పెత్తనం ఏంటి'
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా నేతలు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలలో టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా కన్వినర్ మర్రి రాజశేఖర్, తదితర నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని జనానికి పరిచయం చేసేందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ ఉత్సవాలను చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు వివరించారు. సత్తెనపల్లిలో గెలిచిన కోడెల.. నరసారావుపేటలో పెత్తనం చేయడం ఏంటి అని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా?
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏం జరిగినా అందుకు కారణం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు అని జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. గుంటూరు పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు తగలబడితే వైఎస్ జగనే కారణమంటూ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆయన ఏపీ మంత్రులను ఎద్దేవా చేశారు. -
నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్
పలు వివాహాలకు హాజరు సాక్షి, హైదరాబాద్/గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు వివాహాలకు హాజరుకానున్నారని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం ఉదయం గుంతకల్‌కు సమీపంలోని కసాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత బె ంగుళూరుకు చేరుకుంటారు. అనంతరం విమానంలో విజయవాడకు వెళ్లి పార్టీ జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కుమారుని వివాహంతోపాటు స్థానికంగా నిర్ణయించే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. బెంగళూరు నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డులో రాత్రి 11.33 నిమిషాలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు. -
ఎవరి అనుమతితో తాళం వేశారు?
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటరూరల్ : గంగన్నపాలెంలోని ఎత్తిపోతల పథకానికి టీడీపీ నాయకులు తాళం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించకుండా నిలిపివేసేందుకు టీడీపీ నేతలు ఆదివారం రాత్రి తాళాలు వేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించి, అదే రోజు సాయంత్రం టీడీపీ నేతలు వేసిన తాళం పగులకొట్టి కొత్త తాళం వేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ‘మేడమ్’కు తెలియజేయడంతో ఆమె ఆదేశాలతో మంగళవారం పోలీసులు ఎత్తిపోతల పథకం భవనానికి మరో తాళం వేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. గంగన్నపాలెంలోని నరసరావుపేట - చిలకలూరిపేట రాష్ర్ట రహదారిపై వేలాది మంది రైతులతో ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనను విఫలం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. దీంతో రైతులు పోలీసుల తీరును నిరసిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి రైతుల వ్యతిరేకిని విమర్శించారు. రూరల్ సీఐ టి.దిలీప్‌కుమార్ ఘటన ప్రాంతానికి చేరుకుని ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించరాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌కు సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకానికి ఎవరి అనుమతి తీసుకుని తాళం వేశారని సీఐని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డుపైనే భీష్మించు కూర్చున్నారు. పోలీసులు మర్రి రాజశేఖర్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలియజేసి, కొంతదూరం రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీస్ జీపులోకి ఎక్కించారు. ఆగ్రహించిన రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కోమటినేనివారిపాలెం - గోవిందపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసు జీపునకు ఎదురుగా బైఠాయించారు. తామంతా పాదయాత్ర ద్వారా చిలకలూరిపేట స్టేషన్ వరకు వస్తామంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు అందరితో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో తాళాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చాపలమడుగు గోవర్ధన్, మురికిపూడి సొసైటీ అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష కార్యదర్శులు సామినేని బాబూరావు, మన్నవ మాణిక్యాలరావు, గ్రామ సర్పంచి మన్నవ నళినీ, మహిళా విభాగం నాయకులు నల్లమాల సౌజన్య, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవీఎం.సుభానీ, ఎస్సీసెల్ అధ్యక్షులు కుల్లి సూర్యవర్ధనరావు, పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ ధర్నా
♦ సర్కారు వైఫల్యాలపై గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన ♦ రైతుకు మద్దతుగా ఆందోళన ♦ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలి ♦ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థత, ఖరీఫ్ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, కేంద్రంలో వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచడంలో కృషి చేయలేకపోవడం, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయలేకపోవడం, రుణాలు సకాలంలో అందకపోవడం వంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుత కాలంలో రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పక్కన పెట్టి ‘ఓటుకు కోట్లు’ కేసులో మునిగిపోయారని, పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు అందజే సేందుకు దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. గత సంవత్సరం పండించిన పంట అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి మాట్లాడకుండా తక్కిన పనికిరాని విషయాలన్నీ చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులకు వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుదన్నారు. రైతుల సమస్యల కోసం చేపడుతున్న ధర్నా కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని కోరారు. విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఆర్కే పిలుపు మాచర్లటౌన్ : వైఎస్సార్ సీపీ చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తెలుగుదేశం ప్రభుత్వం కాలం వెళ్లదీస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. -
సమరదీక్ష విజయాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు
టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞత కోల్పోయి మాట్లాడితే సహించం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఏటీఅగ్రహారం(గుంటూరు) : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 3,4 తేదీల్లో నిర్వహించిన సమర దీక్ష విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే తమ పార్టీ అధినేత సమర దీక్ష ద్వారా టీడీపీ వైఫల్యాలను విమర్శించారని చెప్పారు. టీడీపీ నాయకులు సభ్యతలేని విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కార్పొరేటర్ స్థాయి లేని ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వ్యక్తులు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర ఆరోపించడం సబబు కాదన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి శిఖా బెనర్జి, నాయకులు మొగిలి మధుసూదనరావు, కొత్తా చిన్నపరెడ్డి, రాచకొండ ముత్యాలరాజు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, హనుమంతరావు, మస్తాన్‌రావు, కుంభా నాగేశ్వరరావు, పాల్గొన్నారు. -
ఎందుకీ హడావుడి శంకుస్థాపన..?
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి పాతగుంటూరు: రాజధాని నిర్మాణానికి ఇంత హడావుడిగా శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, విభజన చట్టం చెబుతుండగా, దాని ఆధారంగానే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తన సొంతింటికి మొన్నే శంకుస్థాపన చేశారన్నారు. రాజధానికి సంబంధించి ఇంతవరకు మాస్టర్ ప్లాన్ తయారు చేయలేదని, ఏ ప్లాన్ లేకుండా శంకుస్థాపన చేస్తున్నారంటే, ఇది కేవలం కంపెనీల కోసం చేస్తున్న శంకుస్థాపన అని అర్ధమవుతోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగి భూములు ఇచ్చిన రైతులు సైతం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తుండంతో ప్రభుత్వం భయపడి హడావుడిగా శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ల్యాండ్‌పూలింగ్‌కు అంగీకరించని రైతులపై భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తామని ఏనాడో సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రకటించారన్నారు. కోర్టులో ఓ పక్కన ఈ అంశంపై పిటీషన్లు ఉన్నాయని, వాదనలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు, కౌలు రైతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులు పనుల కోసం సింగపూర్, జపాన్, చైనాలకు వలస పోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మంది రైతులు రుణమాఫీ కాలేదంటూ క్యూ కడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కొద్ది ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు 3.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారన్నారు. టూరిజం పేరు మీద ప్రభుత్వ భూముల్ని, భూసేకరణ ద్వారా ప్రైవేటు భూములను తమకు కావాల్సిన వ్యక్తులకు సంతర్పణచేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. వీటిన్నింటిపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. డీఎడ్ ప్రవేశపరీక్ష నిర్వహించకపోవడం అన్యాయం చిలకలూరిపేటటౌన్: డీఎడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డీ ఎడ్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు గురువారం పట్టణంలోని మర్రి నివాసానికి వచ్చి సమస్యలు వివరించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై వత్తడి తెచ్చి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీటీసీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేశారని, జూన్ 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడదల చేయలేదని వివరించారు. కేవలం ఇంజనీరింగ్ కళాశాలల భర్తీ చేసుకోవడం కోసం డీఎడ్ ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై తమ పార్టీ తరఫున పోరాడతామని, న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయం పరిశీలిస్తామని హామి ఇచ్చారు. -
జగన్ దీక్షకు రండి
గుంటూరు సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీని కాంక్షిస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి 1న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపడుతున్న రైతుదీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్‌పేటలోని జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీని తుంగలో తొక్కే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలను గాలికొదిలేసి కేవలం రాజధాని అంశం చుట్టూనే తిరుగుతూ మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సన్నద్ధమయ్యారని మండిపడ్డారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబుకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉందనుకోవడం భ్రమే అవుతుందన్నారు. రైతులు, మహిళలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబన్నారు. ప్రస్తుతం రాజధాని పేరుతో మరో నాటకానికి నిస్సిగ్గుగా తెర తీశారనీ, ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి నిజమైన పాలన చేయాలని ఎమ్మెల్యే హితవు పలికారు. జగన్ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఓ పక్క రుణం మాఫీ కాక, మరో పక్క కొత్త రుణం పుట్టక, గిట్టుబాటు ధర దక్కక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి పీఠమె క్కిన బాబు ప్రస్తుతం ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కక రైతులు అల్లాడుతున్నారన్నారు. దీనికి నిరసనగా జగన్ చేపట్టిన రైతుదీక్షకు అందరూ సంఘీభావం ప్రకటించాల్సి ఉందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, రైతులు, మహిళలతో పాటు విద్యార్థులు, యువజనులను కూడా చంద్రబాబు ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు యువతకు ముఖం చాటేస్తున్నారన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితరాలకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని ముల్లుగర్ర పెట్టి లేపే రీతిలో జగన్ తలపెట్టిన రైతుదీక్షను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం జగన్ రైతు దీక్ష పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, సేవాదళ్ కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, ఎస్టీ సెల్ కన్వీనర్ మీరాజ్యోత్ హనుమంతునాయక్, రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, విద్యార్థి విభాగం కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి, మండెపూడి పురుషోత్తం, యనమల ప్రకాష్, సిద్ధయ్య, మేరువ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.