సమరదీక్ష విజయాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు | ysrcp leader marri rajashekar fires on tdp | Sakshi
Sakshi News home page

సమరదీక్ష విజయాన్ని జీర్ణించుకోలేకే విమర్శలు

Published Sun, Jun 7 2015 4:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

ysrcp leader marri rajashekar fires on tdp

టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞత కోల్పోయి మాట్లాడితే సహించం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 
 ఏటీఅగ్రహారం(గుంటూరు) : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 3,4 తేదీల్లో నిర్వహించిన సమర దీక్ష విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే తమ పార్టీ అధినేత సమర దీక్ష ద్వారా టీడీపీ వైఫల్యాలను విమర్శించారని చెప్పారు.

టీడీపీ నాయకులు సభ్యతలేని విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కార్పొరేటర్ స్థాయి లేని ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వ్యక్తులు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌సీపీ పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర ఆరోపించడం సబబు కాదన్నారు.

అనవసర ఆరోపణలు చేస్తే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి శిఖా బెనర్జి, నాయకులు మొగిలి మధుసూదనరావు, కొత్తా చిన్నపరెడ్డి, రాచకొండ ముత్యాలరాజు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, హనుమంతరావు, మస్తాన్‌రావు, కుంభా నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement