
'నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమమే'
గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
రబీకి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, నీరు లేక పంట భూములన్నీ బీడులుగా మారిపోతున్నాయని నేతలు మండిపడ్డారు. మంచినీళ్ల చెరువులు కూడా ఎండిపోతున్నాయని అందుచేత వెంటనే సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు.