నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్ | Ys jagan to anantha and guntur districts | Sakshi
Sakshi News home page

నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్

Published Sun, Oct 25 2015 4:23 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్ - Sakshi

నేడు అనంత, గుంటూరు జిల్లాలకు జగన్

 పలు వివాహాలకు హాజరు

 సాక్షి, హైదరాబాద్/గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు వివాహాలకు హాజరుకానున్నారని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం ఉదయం గుంతకల్‌కు సమీపంలోని కసాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత బె ంగుళూరుకు చేరుకుంటారు. అనంతరం విమానంలో విజయవాడకు వెళ్లి పార్టీ జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కుమారుని వివాహంతోపాటు స్థానికంగా నిర్ణయించే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బెంగళూరు నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డులో రాత్రి 11.33 నిమిషాలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement