సాక్షి, అమరావతి : డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేందర్ రెడ్డి, లావు కృష్ణ దేవరాయలుతో కలిసి ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా ఎలా లీకయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు డేటా ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం 60లక్షలకు మించి లేదు.. కానీ 3 కోట్ల మంది డేటా ఎలా సేకరించారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం అక్రమంగా సేకరించిన డేటానే అన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించిన డేటా ద్వారా టీడీపీ నాయకులు తమ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల ఓట్లల్లో అక్రమాలు జరిగాయన్నారు. ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (‘ఐటీ గ్రిడ్స్’లో మరోసారి సోదాలు)
Comments
Please login to add a commentAdd a comment