
వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతారంటూ వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.