
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది.
నరసరావుపేట రూరల్/సాక్షి, హైదరాబాద్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మేనల్లుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అశ్వినీకాంత్, ఆయన సతీమణి డాక్టర్ వీరవల్లి రమ్య వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
జనసేనలో క్రియాశీలంగా పనిచేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు, ఆయన సతీమణి భారతి, అనుచరులు హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. (చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి)