ఆయనకు క్లీన్చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి | No clean chit given Kodela prasadarao in bomb blast case, says ysrcp mla gopireddy srinivasa reddy | Sakshi
Sakshi News home page

ఆయనకు క్లీన్చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి

Published Tue, Mar 15 2016 3:14 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ఆయనకు క్లీన్చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి - Sakshi

ఆయనకు క్లీన్చిట్ ఇవ్వలేదు: గోపిరెడ్డి

ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాటిని కాలరాస్తున్నారని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాటిని కాలరాస్తున్నారని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా కోడెల శివప్రసారావు సమీక్షలు చేస్తున్నారని అన్నారు.

 

ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యే అయినప్పటికీ.. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జరగాల్సిందేనన్నారు.  ప్రభుత్వ కార్యక్రమాలకు చాలాసార్లు స్థానిక ఎమ్మెల్యేగా తనకు సమాచారం కూడా ఇవ్వరన్నారు. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు.  ఇది వాస్తవమని, దీనిపై సభా కమిటీ వేస్తే వాస్తవం తెలుస్తుందన్నారు. శాసనసభ స్పీకర్గా ఆయన తన హక్కులను కాపాడటం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. అందుకే తాము అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు.

ఇక బాంబు పేలుళ్ల కేసులో కోడెల శివప్రసారావుకు సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని గోపిరెడ్డి స్పష్టం చేశారు.  కోడెలను సీబీఐ ప్రాసిక్యూషన్కు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒప్పులేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. ఇక ఎమ్మెల్యేను గాయపరిచి, ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిందెవరో అందరికీ తెలుసు అని అన్నారు. అలాగే స్పీకర్ స్ధానంలో ఉన్న వ్యక్తి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కావచ్చా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయన అవినీతి గురించి సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement