హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు స్పీకర్ కోడెల శిపప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. దీంతో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్... అవిశ్వాస తీర్మానం వీగిపోయినందున కోడెల శివప్రసాదరావును స్పీకర్ స్థానంలో కూర్చోవాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తనపై అవిశ్వాసం ప్రకటించడం బాధగా ఉందన్నారు. స్పీకర్ గా నిష్పక్షపాతంగా వ్యహరిస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత సమావేశాలను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు.