గుంటూరు జిల్లాలో రేషన్ డీలర్ల వ్యవహారంలో టీడీపీ తీవ్ర అక్రమాలకు పాల్పడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో రేషన్ డీలర్ల వ్యవహారంలో టీడీపీ తీవ్ర అక్రమాలకు పాల్పడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీడీపీ అక్రమాలను కచ్చితంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ ఆయన ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.