
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర అని, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్దు ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. కోటప్పకొండను దర్శించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. చదవండి: టీడీపీని బతికించుకునేందుకు దిగజారుడు రాజకీయం
Comments
Please login to add a commentAdd a comment