Oppositions leaders
-
ముందస్తు అరెస్ట్ ల పేరుతో పోలీసుల అత్యుత్సాహం
-
ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
Opposition's Presidential polls candidate Yashwant Sinha.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా.. పార్లమెంట్ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. Opposition's Presidential polls candidate Yashwant Sinha files his nomination at the Parliament in Delhi pic.twitter.com/2BGztPZwmB — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే పవర్ ఇవ్వండి.. న్యాయ శాఖకు ఈసీ వినతి -
‘విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర అని, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్దు ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. కోటప్పకొండను దర్శించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. చదవండి: టీడీపీని బతికించుకునేందుకు దిగజారుడు రాజకీయం -
విపక్షాల పర్యటన.. కశ్మీర్లో ఉత్కంఠ!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇంకా కొన్ని చోట్ల నిషేదాజ్ఞలు కొనసాగుతున్న వేళ విపక్షాల పర్యటన ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ పరిణామం అక్కడి అధికారులను, సిబ్బందిని కలవర పెడుతోంది. విపక్షాల అగ్రనాయకుల పర్యటన శాంతి స్థాపనకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు మరికొన్ని జాతీయ పార్టీల నేతలు నేడు కశ్మీర్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అనంతరం అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోయలో పరిస్థితులు ప్రశాతంగా ఉన్నాయని, అవసమరయితే స్వయంగా తెలుసుకునేందుకు లోయలో పర్యటించాలని గతంలో గవర్నర్ సత్యపాల్ రాహుల్కు ఆహ్వానించారు. రాహుల్ గాంధీ అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన విపక్ష లోయలో బృందం పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ సహా గులాం నబీ ఆజాద్, కేసీ.వేణుగోపాల్, ఆనంద్ శర్మ, డి.రాజా, సీతారాం ఏచూరి, సహా ఇతర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరింత ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే కశ్మీర్లో పర్యటించేందుకు మాత్రం అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దాటి రావడానికి వీళ్లేదని తేల్చిచెప్పాయి. వారు పర్యటించే ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ను అమలు చేశారు. కశ్మీర్ మాజీ సీఎం, సీనియర్ నేత గులాంనబీ అజాద్ ఇంటి ముందు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. లోయలో వాతావరణం ప్రశాతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు విపక్ష నేతల పర్యటనపై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రశాతంగా ఉన్న కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకే అక్కడ పర్యటిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుపడింది. మరోవైపు వీరి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ నాయకులు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని కోరింది. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు. -
అవేం మాటలు.. మానవత్వం లేదా?
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ: కశ్మీర్లో డర్టీ వార్ కొనసాగుతోందని, ఈ యుద్ధంలో వినూత్న పద్ధతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన దేశ అంతర్గత భద్రతపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించాయి. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ రాజకీయ వివాదాలకు కేంద్రం కావడం దురదృష్టకరమన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సింది సైన్యం కాదని, రాజకీయ నాయకత్వమని తేల్చిచెప్పారు. రావత్ వాడుతున్న భాష తాను చిన్నప్పటి నుంచి వింటున్న భారత సైన్యానిది కాదని సీపీఐ(ఎం) నేత మహ్మద్ సలీం విమర్శించారు. రావత్ మాటలు వింటే ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యనించారు. రావత్ రాజకీయ వ్యాఖ్యల్ని చేయడం మానుకోవాలని జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కె.సి.త్యాగీ తెలిపారు. వేర్పాటువాద సంస్థ హురియత్తో కాకపోయినా సాధారణ కశ్మీరీలతో సైన్యం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని త్యాగీ సూచించారు. కశ్మీర్ సమస్యను కేవలం శాంతి భద్రతల కోణంలో మాత్రమే చూడలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా స్పష్టం చేశారు. నిరంతరం చర్చలు జరపడంతో పాటు కశ్మీరీ యువత పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కశ్మీరీ యువత భద్రతా బలగాలపై రాళ్లు విసరడమన్నది చాలా తీవ్రమైన సమస్యని ఝా అభిప్రాయపడ్డారు. మరోవైపు రావత్ వ్యాఖ్యల్ని కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. ‘కశ్మీర్లో పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యనైనా తీసుకుంటామని రావత్ చెప్పారు. నేను దాన్నే సమర్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్విటర్లో తెలిపారు.