
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేయటంతో పరిస్థితి అదుపుతప్పింది. అంజుమన్ కమిటీ స్థల వివాదంలో ఉదయం ఎమ్మెల్యే గోపిరెడ్డి ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ధర్నాకు పోటీగా గోపిరెడ్డి ఇంటిముందు హల్‌చల్ చేశారు. ఇరు వర్గాల మోహరింపుతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు చేతులు దాటిపోతుండటంతో పోలీసులు కలుగజేసుకుని వారిని చెదరగొట్టారు.