apprecitation
-
PM Narendra Modi : తెలుగు సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్
PM Narendra Modi Appreciates Telugu Cinemas: తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. 'సిల్కర్ స్కీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి' అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. 🙏🙏🙏🙏 #TeluguCinema 🙏🙏 pic.twitter.com/YYAjBygPow — Harish Shankar .S (@harish2you) February 5, 2022 -
డీజీపీకి సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు పొందిన నేపథ్యంలో పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు సాధించడంపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ టెక్నికల్ సర్వీసెస్ జి. పాలరాజు తదితరులు ఉన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని స్కోచ్, ఫిక్కీ, ఎన్సీఆర్బీ-నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో/కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించాయి. వీటిలో అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కే దక్కింది. చదవండి: జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ -
ఏపీ ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పశంసించారు. బుధవారం ప్రధాని సంప్రదాయేతర విద్యుత్ వివిధ రాష్ట్రాల మధ్య పంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధాని మాట్లాడుతూ.. ఏపీలోని వేమగిరి ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి యువ అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి ప్రాజెక్టులో భాగంగా దేశంలో ముఖ్యమైన అభివృద్ధి పనులను ప్రధాని నేరుగా సమీక్షించారు. -
రైస్ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న జిల్లా రైస్‌మిల్లర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలోని పుష్కరిణి ఘాట్–1లో జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్ తరఫున భక్తులకు కల్పిస్తున్న నిత్య అన్నదానం కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరపున జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డిని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ పుష్కర స్నానం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారందరి ఆకలి తీర్చే విధంగా మిల్లర్లు చేయూతనివ్వడం ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి రోజూ 10 నుంచి 15 వేల మందివరకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న మిల్లర్లు అందరికీ ఆయన తన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్ఈసీ చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, మిల్లర్లు చలువాది బ్రహ్మయ్య, పి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.