
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు పొందిన నేపథ్యంలో పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను సోమవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్ధాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 జాతీయస్ధాయి అవార్డులు సాధించడంపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఇంటెలిజెన్స్ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ టెక్నికల్ సర్వీసెస్ జి. పాలరాజు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బీ-నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో/కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించాయి. వీటిలో అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కే దక్కింది.
చదవండి: జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్
Comments
Please login to add a commentAdd a comment