Telangana: రైస్‌ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు.. | Telangana CM KCR Waived Rice Millers GST Dues | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు.. సీఎం కేసీఆర్ ఆదేశాలు..

Published Tue, Nov 29 2022 8:31 AM | Last Updated on Tue, Nov 29 2022 2:50 PM

Telangana CM KCR Waived Rice Millers GST Dues - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రాసెస్‌ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడతామని తెలిపారు.

2015 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2017 జూన్‌ 30వ తేదీ మధ్య ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతికి సంబంధించిన 2 శాతం సెంట్రల్‌ సేల్స్‌ టాక్స్‌ (సీఎస్టీ) బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర రైస్‌ మిల్లర్లు, రైతుల ప్రయోజనాలను  ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురుతో మిల్లర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. 
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో  సీ– ఫారం దాఖలు చేస్తే సీఎస్టీలో 2 శాతం రాయితీని కలి్పంచే విధానం ఉండేది. ఆ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పాడ్డాక మొదట్లో అమలు చేశారు. 2015 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2017 జూన్‌ 30వ తేదీ మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ– ఫారం సబి్మట్‌ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కలి్పంచడం నిలిపివేశారు.

దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతకాలంగా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వాపోతున్నారు. బియ్యం ఎగుమతి చేశామా.. లేదా? అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్‌ సరి్టఫికెట్లు, లారీ, రైల్వే పరి్మట్లు, వే బిల్లులు తదితర ఏ ఆధారమైనా తాము సబ్మిట్‌ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్ను  రద్దు చేయాలని కోరుతున్నారు.

ఇదే విషయాన్ని సోమవారం దామరచర్లలో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సమక్షంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్, ఉపాధ్యక్షుడు కర్నాటి రమే‹Ù, సంఘం మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌ తదితరులు సీఎంను కలిసి వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. అలాగే రైస్‌ మిల్లర్లకు, రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని ఆదేశించారు.   

సీఎస్‌ ఉత్తర్వులు 
2015, ఏప్రిల్‌ 1 నుంచి 2017, జూన్‌ 30 వరకు జరిగిన బియ్యం అమ్మకాల లావాదేవీలపై సీఎస్టీని ఎత్తివేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు అమ్మిన ధాన్యం విషయంలో సీ–ఫారంలు సమరి్పంచకపోయినా, పరి్మట్, లోడింగ్‌ సర్టిఫికెట్, రవాణా రశీదులు, వే బిల్లుల్లాంటి ఆధారాలను సమరి్పస్తే 2 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

ముఖ్యమంత్రికి రైస్‌ మిల్లర్స్‌ కృతజ్ఞతలు 
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు గంప నాగేందర్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మిల్లింగ్‌ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిõÙకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీ– ఫారం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు.
చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement