waived
-
రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ కోసం రైతులు ప్రతి ఏడాది కరువు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో రుణ మాఫీల గురించి మాట్లాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. "వ్యవసాయానికి కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రుణ మాఫీ రద్దు కోసం రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవడం ఏ మాత్రం సరికాదు." అని మంత్రి శివానంద పాటిల్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని దుయ్యబట్టింది. పాటిల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి వర్గం తెలివిలేనివాళ్లతో నిండిపోయిందని విమర్శించింది. ఇదీ చదవండి: 'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం -
Telangana: రైస్ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రాసెస్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతికి సంబంధించిన 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర రైస్ మిల్లర్లు, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురుతో మిల్లర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సీ– ఫారం దాఖలు చేస్తే సీఎస్టీలో 2 శాతం రాయితీని కలి్పంచే విధానం ఉండేది. ఆ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పాడ్డాక మొదట్లో అమలు చేశారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ– ఫారం సబి్మట్ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కలి్పంచడం నిలిపివేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతకాలంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వాపోతున్నారు. బియ్యం ఎగుమతి చేశామా.. లేదా? అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్ సరి్టఫికెట్లు, లారీ, రైల్వే పరి్మట్లు, వే బిల్లులు తదితర ఏ ఆధారమైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్లలో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ఉపాధ్యక్షుడు కర్నాటి రమే‹Ù, సంఘం మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తదితరులు సీఎంను కలిసి వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే రైస్ మిల్లర్లకు, రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని ఆదేశించారు. సీఎస్ ఉత్తర్వులు 2015, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 30 వరకు జరిగిన బియ్యం అమ్మకాల లావాదేవీలపై సీఎస్టీని ఎత్తివేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు అమ్మిన ధాన్యం విషయంలో సీ–ఫారంలు సమరి్పంచకపోయినా, పరి్మట్, లోడింగ్ సర్టిఫికెట్, రవాణా రశీదులు, వే బిల్లుల్లాంటి ఆధారాలను సమరి్పస్తే 2 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రైస్ మిల్లర్స్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిõÙకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీ– ఫారం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
మాఫీ సాధ్యం కాదు
రైతులు తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే యశస్విని ప్రీమియం తగ్గింపు యోచన గ్రామ పంచాయతీ పరిధిలో సహకార సంఘం ఏర్పాటు సహకార సంఘాల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి రుణాలు మంత్రి మహదేవ ప్రసాద్ బెంగళూరు: రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని, వడ్డీతో సహా వాటిని రైతులు తిరిగి చెల్లించితీరాల్సిందేనని రాష్ర్ట సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిసారీ రైతుల రుణాలను మాఫీ చేయలేమని తేల్చి చెప్పారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30 లోపు రాష్ర్టంలోని 24 లక్షల మంది రైతులకు రూ. పది వేల కోట్ల మేర రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే రూ. ఏడు వేల కోట్ల రుణాలను అందజేసినట్లు తెలిపారు. యశస్విని పథకం కింద నగరంలోని సహకార సంఘాల్లోని సభ్యులు ఏడాదికి ప్రీమియంగా చెల్లిస్తున్న రూ.650ను మరింత తగ్గించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 78 లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ప్రస్తుతం 30 లక్షల కుటుంబాలు మాత్రమే సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. మిగిలిన వారిని కూడా సహకార సంఘాల సభ్యులుగా చేర్చడానికి వీలుగా సభ్యత్వ రుసుంను ప్రభుత్వమే చెల్లించేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సహకార సంఘాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపించడానికి వీలుగా స్థానిక సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్లో స్పష్టంగా విధివిధానాలు వెల్లడిస్తామన్నారు. గృహ నిర్మాణ రంగంలోని సహకార సంఘాలు అవసరమైన పరిమాణంలో ఇకపై నేరుగా భూమిని ఖరీదు చేయడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకువచ్చి రానున్న శాసనసభ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెడుతామని మహదేవ ప్రసాద్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ నుంచి రీ-షెడ్యూల్‌పై ఎటువంటి ఆదేశాలు రాలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ రుణాల రీ-షెడ్యూల్, మాఫీపై ఆర్బీఐ నుంచి ఇంత వరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలంగాణ రాష్ట్ర లీడ్ బ్యాంకరుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మేరకు వ్యవసాయ రుణ బకాయిల వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శంతను ముఖర్జీ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఈ నిర్వహించిన ‘ఆర్థిక సంస్కరణలు-పురోభివృద్ధి’ సదస్సులో ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీ, రీ-షెడ్యూల్ గురించి ఆర్బీఐ నుంచి ఎటువంటి సూచనలు రాలేదన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు రుణాలు చెల్లిం చడం లేదని, దీంతో ఎన్పీఏలు పెరుగుతున్నాయన్నా రు. 2 రోజుల్లో ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటంతో ఎన్పీఏల గురించి ఇప్పుడు చెప్పలేమని, ఒకసారి రుణ మాఫీ పథకంపై స్పష్టత వస్తే ఎన్పీఏలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణ మాఫీ కంటే కొత్త రుణాలను మంజూరు చేయడంపైనే దృష్టిసారించామని, ఇందుకు త్వరలోనే సీఎంతో ఎస్ఎల్బీసీ సమావేశం జరపనున్నట్లు ముఖర్జీ తెలిపారు. ద్వితీయార్థం బాగు..: ప్రస్తుతం కార్పొరేట్ రుణాల డిమాండ్ స్థబ్తుగా ఉందని, ద్వితీయార్థం నుంచి వీటికి డిమాండ్ పెరుగుతుందనేది తమ అంచనా అన్నారు. మౌలికరంగం పుంజుకుంటుందని భా విస్తున్నామని, కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనం అనేది ప్రభుత్వం, ఎస్బీఐ చేతుల్లో ఉందని.. దీనిపై తాము మాట్లాడటానికి ఏమీ లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.