బెంగళూరు: రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ కోసం రైతులు ప్రతి ఏడాది కరువు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో రుణ మాఫీల గురించి మాట్లాడారు. దీనిపై బీజేపీ మండిపడింది.
"వ్యవసాయానికి కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రుణ మాఫీ రద్దు కోసం రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవడం ఏ మాత్రం సరికాదు." అని మంత్రి శివానంద పాటిల్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శివానంద పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని దుయ్యబట్టింది. పాటిల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి వర్గం తెలివిలేనివాళ్లతో నిండిపోయిందని విమర్శించింది.
ఇదీ చదవండి: 'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం
Comments
Please login to add a commentAdd a comment