మిల్లర్ల జిమ్మిక్కు | Gambling of millers | Sakshi
Sakshi News home page

మిల్లర్ల జిమ్మిక్కు

Published Mon, Apr 3 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

మిల్లర్ల జిమ్మిక్కు

మిల్లర్ల జిమ్మిక్కు

- రూ.60 కోట్ల సీఎంఆర్‌ ఎగవేతకు మిల్లర్ల వ్యూహం
- నోటీసులు జారీ చేసిన అధికారులు


కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా రైస్‌ మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన రూ.60 కోట్లు విలువజేసే సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉంది. కాగా సీఎంఆర్‌ చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న ఏడుగురు రైస్‌ మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్ట్‌ అమలు చేయనున్నారు. మహిళల వేషంలో హైవేపై దోపిడీలు దీనికి సంబంధించి రైస్‌ మిల్లర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నెల్లూరు(పొగతోట): సీఎంఆర్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న మిల్లర్లపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి సీఎంఆర్‌ ఇవ్వకుండా రైస్‌ మిల్ల ర్లు దర్జాగా తిరుగుతున్నారు. 2011–12 సంవత్సరానికి సంబంధించి రూ.6. కోట్లు, 2014–15కు 1750 మెట్రిక్‌ టన్నులకు రూ.3.69 కోట్లు సీఎంఆర్, 2015–16 సంవత్సరానికి సంబం«ధించి 23,400 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ రికవరీ చేయాల్సి ఉంది. సుమారు రూ.50 కోట్లకు పైగా సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చిన రైస్‌ మిల్లర్లకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాల్సి ఉంది. రైస్‌ మిల్లర్‌ కోటి రూపాయలకు బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తే అంత విలువ చేసే ధాన్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. గతంలో బ్యాంక్‌ గ్యారంటీæ కొంత మంది వద్ద డీడీలు, చెక్కులు కొంత మంది రైస్‌ మిల్లర్ల వద్ద తీసుకుని ధాన్యం సరఫరా చేశారు.

కోర్టును ఆశ్రయించిన మిల్లర్లు
ధాన్యం తీసుకుని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి స్వాహా చేసిన కొంత మంది రైస్‌ మిల్లర్లు తప్పు మాదికాదు.. అధికారులదని కోర్టును ఆశ్రయించారు. తేమ శాతం అధికంగా ఉండే ధాన్యాన్ని సరఫరా చేశారని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ధాన్యం తరలించారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు సరఫరా అయినట్లు రైస్‌ మిల్లర్లు రికార్డులో సంతకం చేశారు. ఇంత కాలం విషయం చెప్పకుండా   కోర్టును ఆశ్రయించినా ఫలితం అనుకూలంగా రాదని గ్రహించిన రైస్‌ మిల్లర్లు ప్లేటు ఫిరాయించారు. సమయం ఇవ్వండి సీఎంఆర్‌ పూర్తి స్థాయిలో సరఫరా చేస్తామని అధికారులు చుట్టూ్ట ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (íపీపీసీలు) ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తోంది. పీపీసీల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఎంపిక చేసిన రైస్‌ మిల్లులకు తరలిస్తారు. అయితే ధాన్యం కొనుగోళ్ల లో  అవకతవకలు చోటుచేసుకున్నాయి. వరి సాగు చేయని రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో లక్షల రూపాయలు నగదు జమ చేశారు.

ఈ విషయంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. రైస్‌ మిల్లర్లు నిర్దేశించిన సమయంలో ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్‌ కింద తిరిగి జిల్లా పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంది. 2015–16 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.450 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పీపీసీల ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టు్టకు సీఎంఆర్‌ పూర్తి స్థాయిలో సరఫరా చేయాల్సి ఉంది. రైస్‌ మిల్లర్లు తీసుకున్న ధాన్యాన్ని ఆడించి బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు.  

గడువు పూర్తయినా మూడు నెలల సమయం
సీఎంఆర్‌ తిరిగి సరఫరా చేయడానికి గడువు పూర్త యిన తరువాత మిల్లర్లకు మూడు నెలల సమయం ఇచ్చారు. సమయం దాటినా సీఎంఆర్‌ సరఫరా చేయలేదు. ప్రస్తుతం వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్‌ సరఫరా చేయాల్సి ఉంది. సీఎంఆర్‌కు రైస్‌ మిల్లుల ఎంపికలో అ«ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. రెండు వేల టన్నుల సామర్థ్యం లేని రైస్‌ మిల్లులకు 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించారు. అటువంటి రైస్‌ మిల్లర్లు ధాన్యాన్ని బహిరంగా మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో సీఎంఆర్‌ ఎప్పుడు ఇచ్చినా అధికారులు పట్టించుకోరనే ధీమాతో రైస్‌ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు.

అధికారులు, రైస్‌ మిల్లర్లు కుమ్మక్కై సీఎంఆర్‌ స్వాహా చేశారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. ధాన్యం సేకరణకు 19 పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేయడానికి జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లు ముందుకు రాలేదు. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఐదుగురు రైస్‌ మిల్లర్లు ధాన్యం సరఫరా చేయాలని రూ.5 కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చారు. ఈ విధంగా గ్యారంటీ ఇచ్చిన రైస్‌ మిల్లులకు ధాన్యం సరఫరా చేస్తున్నారు.

సీఎంఆర్‌ పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం
సీఎంఆర్‌ పూర్తి స్థాయిలో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం సరఫరాలో అధికారులది తప్పని మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. మళ్లీ వాళ్లే వచ్చి సమయం ఇవ్వండి పూర్తి స్థాయిలో సీఎంఆర్‌ సరఫరా చేస్తామని అడిగారు. వరి కోతలు జరుగుతున్నాయి సమయం ఇచ్చి రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటాం.
–కృష్ణారెడ్డి,జిల్లా పౌరసరఫరాల సంస్థ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement