CMR supply
-
‘ప్రజాపంపిణీ’ పక్కదారి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైస్‌మిల్లులు సీఎమ్మార్ (కస్టం మిల్లింగ్ రైస్) చిల్లు పెడుతున్నాయి. మర ఆడించాల్సిన ధాన్యాన్ని తెరచాటుగా పక్కదారి పట్టిస్తు న్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పెద్ద ల పాలవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దా టి అక్రమార్కుల చెంతకు చేరుతున్నాయి. రాష్ట్రంలో దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ప్రతినెలా ప్రభుత్వం రూపాయికి కిలోబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరఫరా చేస్తోంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొని, మర ఆడించి ఇచ్చేలా రైస్‌మిల్లులకు సీఎమ్మార్(కస్టం మిల్లింగ్ రైస్) కేటాయిస్తోంది. మర ఆడించినందుకుగాను మిల్లర్లకు చార్జీలు సైతం చెల్లిస్తోంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో పందికొక్కులు చేరి సీఎమ్మార్ బియ్యాన్ని బొక్కేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో సీఎమ్మార్ ధాన్యం యథేచ్ఛగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలుతోంది. గద్వాల – కర్ణాటక – తమిళనాడు.. ఉమ్మడి పాలమూరు నుంచి సీఎమ్మార్ ధా న్యం ప్రధానంగా మూడు దశల్లో రాష్ట్ర సరి హద్దులు దాటుతోంది. గద్వాల నుంచి కర్ణా టకలోని రాయచూర్.. ఆ తర్వాత గంగావ తి జిల్లాలోని కాటుక టౌన్‌కు.. అక్కడి నుంచి తమిళనాడులోని గంగై పట్టణానికి త రలుతోంది. రాష్ట్రంలో ధాన్యానికి అధికంగా క్వింటాల్‌కు రూ.1,880 ధర పలుకుతుండగా, గంగైలో రూ.3 వేలకుపైగా పలుకుతోంది. క్వింటాల్‌కు అధికంగా రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వస్తుండటంతో అక్రమార్కులు అక్కడికి దొంగచాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం గద్వాల జిల్లాలో ఈ నెల 18న సీఎమ్మార్ ధాన్యాన్ని తరలిస్తూ పట్టుబడిన మూడు లారీలే. ఇవే నిదర్శనం.. ►గతేడాది యాసంగిలో గద్వాల జిల్లాలో 1,27,476 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29 రైస్ మిల్లులకు సీఎమ్మార్ కింద కేటా యించారు. సరిగ్గా మర ఆడిస్తే 85,489 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. అయి తే ఇప్పటివరకు 23,170 మెట్రిక్ టన్నులను మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి అ ప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడు వు ఈ నెలాఖరులోపు ఇంకా 62,319 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని అప్పగించాలి. వారంలో ఇంతమొత్తం అప్పగించడం సాధ్యం కాదనేది సుస్పష్టం. అటు మిల్లుల్లో సీఎమ్మార్ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు కనిపించడం లేదని సివిల్ సప్లయ్ వర్గాలే చెబుతున్నాయి. అంటే 70 శాతం మేర ధాన్యం తమిళనాడుకు తరలిపోయినట్లు తెలుస్తోంది. ►శ్రీ ఆంజనేయ రైస్ మిల్లుకు గత యాసంగికి సంబంధించి 2,883.320 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ధాన్యం కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 421.900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి చేరింది. ఇంకా 1499.924 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న ఈ మిల్లు నుంచి 1,399 బస్తాల ధాన్యాన్ని రెండు లారీల్లో తమిళనాడుకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు వేరొకరికి చెందిన మరో లారీలో 600 బస్తాల ధాన్యం తరలుతుండగా అధికారులు మల్దకల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గద్వాల స్టేషన్‌కు తరలించిన ఈ వాహనాలను తప్పించేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. వీరిపై ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత 6ఏ కేసు నమోదు చేశారు. 50 శాతం వాటా.. గత ఏడాది యాసంగిలో గద్వాల జిల్లా నుం చే కాకుండా నారాయణపేట, నాగర్‌కర్నూ ల్, వనపర్తి జిల్లాల నుంచి కూడా ధాన్యం సేకరించారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి సీఎమ్మార్ కింద మిల్లులకు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత రేషన్ మాఫియాను తెర ముం దు ఉంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగానికి ముందు రేషన్ దందా నిర్వహిస్తున్న ముఖ్యులతో ఆయన సమావేశమై 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. మూడు లారీలు పట్టుబడిన క్రమంలో రేషన్ మాఫియాకు చెందిన ఓ లీడర్ ‘మాకేం మిగులుతాంది.. ఆయనకే సగం పోతాంది’అని తెలిసిన వారి వద్ద వాపోయినట్లు సమాచారం. నెలనెలా రేషన్ మాఫియా నుంచి ఆమ్యామ్యాలు అందుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.. లేక సదరు ప్రజాప్రతినిధి కంటపడితే బదిలీ కాక తప్పదని భయపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. రైస్ మిల్లులకు ప్రభుత్వం సీఎమ్మార్ ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఈ నెల 18న మూడు లారీలలో అక్రమంగా ధాన్యం తరలివెళ్తుండగా పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాం. మూడు లారీలలో రెండు వేల బస్తాల ధాన్యం పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై 6ఏ కేసు నమోదు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో పెద్దల పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – రఘురామ్‌శర్మ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల -
మిల్లర్ల జిమ్మిక్కు
- రూ.60 కోట్ల సీఎంఆర్ ఎగవేతకు మిల్లర్ల వ్యూహం - నోటీసులు జారీ చేసిన అధికారులు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వకుండా రైస్ మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన రూ.60 కోట్లు విలువజేసే సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది. కాగా సీఎంఆర్ చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న ఏడుగురు రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ట్ అమలు చేయనున్నారు. మహిళల వేషంలో హైవేపై దోపిడీలు దీనికి సంబంధించి రైస్ మిల్లర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు(పొగతోట): సీఎంఆర్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న మిల్లర్లపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి సీఎంఆర్ ఇవ్వకుండా రైస్ మిల్ల ర్లు దర్జాగా తిరుగుతున్నారు. 2011–12 సంవత్సరానికి సంబంధించి రూ.6. కోట్లు, 2014–15కు 1750 మెట్రిక్ టన్నులకు రూ.3.69 కోట్లు సీఎంఆర్, 2015–16 సంవత్సరానికి సంబం«ధించి 23,400 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. సుమారు రూ.50 కోట్లకు పైగా సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లర్లకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాల్సి ఉంది. రైస్ మిల్లర్ కోటి రూపాయలకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే అంత విలువ చేసే ధాన్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. గతంలో బ్యాంక్ గ్యారంటీæ కొంత మంది వద్ద డీడీలు, చెక్కులు కొంత మంది రైస్ మిల్లర్ల వద్ద తీసుకుని ధాన్యం సరఫరా చేశారు. కోర్టును ఆశ్రయించిన మిల్లర్లు ధాన్యం తీసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించి స్వాహా చేసిన కొంత మంది రైస్ మిల్లర్లు తప్పు మాదికాదు.. అధికారులదని కోర్టును ఆశ్రయించారు. తేమ శాతం అధికంగా ఉండే ధాన్యాన్ని సరఫరా చేశారని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ధాన్యం తరలించారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మిల్లులకు సరఫరా అయినట్లు రైస్ మిల్లర్లు రికార్డులో సంతకం చేశారు. ఇంత కాలం విషయం చెప్పకుండా కోర్టును ఆశ్రయించినా ఫలితం అనుకూలంగా రాదని గ్రహించిన రైస్ మిల్లర్లు ప్లేటు ఫిరాయించారు. సమయం ఇవ్వండి సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేస్తామని అధికారులు చుట్టూ్ట ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (íపీపీసీలు) ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తోంది. పీపీసీల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఎంపిక చేసిన రైస్ మిల్లులకు తరలిస్తారు. అయితే ధాన్యం కొనుగోళ్ల లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. వరి సాగు చేయని రైతుల బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు నగదు జమ చేశారు. ఈ విషయంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. రైస్ మిల్లర్లు నిర్దేశించిన సమయంలో ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ కింద తిరిగి జిల్లా పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంది. 2015–16 సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.450 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పీపీసీల ద్వారా కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టు్టకు సీఎంఆర్ పూర్తి స్థాయిలో సరఫరా చేయాల్సి ఉంది. రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యాన్ని ఆడించి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. గడువు పూర్తయినా మూడు నెలల సమయం సీఎంఆర్ తిరిగి సరఫరా చేయడానికి గడువు పూర్త యిన తరువాత మిల్లర్లకు మూడు నెలల సమయం ఇచ్చారు. సమయం దాటినా సీఎంఆర్ సరఫరా చేయలేదు. ప్రస్తుతం వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్ సరఫరా చేయాల్సి ఉంది. సీఎంఆర్‌కు రైస్ మిల్లుల ఎంపికలో అ«ధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. రెండు వేల టన్నుల సామర్థ్యం లేని రైస్ మిల్లులకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించారు. అటువంటి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని బహిరంగా మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో సీఎంఆర్ ఎప్పుడు ఇచ్చినా అధికారులు పట్టించుకోరనే ధీమాతో రైస్ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై సీఎంఆర్ స్వాహా చేశారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. ధాన్యం సేకరణకు 19 పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేయడానికి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు ముందుకు రాలేదు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదుగురు రైస్ మిల్లర్లు ధాన్యం సరఫరా చేయాలని రూ.5 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. ఈ విధంగా గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం సరఫరా చేస్తున్నారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం సీఎంఆర్ పూర్తి స్థాయిలో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం సరఫరాలో అధికారులది తప్పని మిల్లర్లు కోర్టును ఆశ్రయించారు. మళ్లీ వాళ్లే వచ్చి సమయం ఇవ్వండి పూర్తి స్థాయిలో సీఎంఆర్ సరఫరా చేస్తామని అడిగారు. వరి కోతలు జరుగుతున్నాయి సమయం ఇచ్చి రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటాం. –కృష్ణారెడ్డి,జిల్లా పౌరసరఫరాల సంస్థ ఎండీ