8న రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | rice millers association electons on 8th october | Sakshi
Sakshi News home page

8న రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Published Wed, Sep 28 2016 1:07 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

జిల్లా రైస్‌ మిల్లర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు వచ్చేనెల 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్‌.రాజ్‌గోపాల్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు మిగతా గవర్నింగ్‌ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నిక ఉంటుందన్నారు.

న్యూశాయంపేట : జిల్లా రైస్‌ మిల్లర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు వచ్చేనెల 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్‌.రాజ్‌గోపాల్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు మిగతా గవర్నింగ్‌ బాడీ పదవులకు ప్రాంతాలవారీగా నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నిక ఉంటుందన్నారు. నామినేషన్‌లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 2 నుంచి 3 వరకు గడువు ఉంటుందన్నారు. 4న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు.  5న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందన్నారు. పోటీలో ఉన్నవారి జాబితాను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారని చెప్పారు. 8న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్‌ అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని, ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు ప్రకటిస్తామన్నారు. హంటర్‌రోడ్‌లోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోటీ చేయదల్చినవారు నామినేషన్‌ పత్రాలను కార్యాలయంలో పొందాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement