టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల | tspsc release notification | Sakshi
Sakshi News home page

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Published Wed, Aug 19 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి నోటిఫికేషన్ విడుదలైంది. 3783 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం లభించగా, ప్రస్తుతానికి 770 ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నోటిఫికేషన్ విడుదల చేశారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఉంటుంది. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 44  ఏళ్లు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రాల్లో ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఘంటా చక్రపాణి తెలిపారు. నోటిఫికేషన్ వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20వ తేదీన పరీక్ష
  • గ్రూప్ 1, 2 పరీక్షలకు సంబంధించిన సిలబస్ను ఈ నెలాఖరుకు ప్రకటిస్తాం
  • సాధారణంగా అయితే సిలబస్ వివరాలను ఉద్యోగ ప్రకటనతో మాత్రమే ఇవ్వాలి. కానీ, కొత్త రాష్ట్రం, కొత్త సిలబస్ కాబట్టి ముందుగా చదువుకునే అవకాశం ఉంటుందని ఇస్తున్నాం
  • అక్టోబర్ చివరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం
  • డిసెంబర్ లోపు గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం ఉంటుంది
  • గ్రూప్ 1కు ఇంకా కొన్ని సమస్యలున్నాయి
  • వాటిలో 53 పోస్టులను మాకు ఇచ్చారు. కానీ వాటిలో కొన్నింటికి సంబంధించి న్యాయపరమైన సమస్యులన్నాయి.
  • కమలనాథన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరికొన్ని కొత్త ఖాళీలు రావచ్చు.
  • వాటిని బట్టి నవంబర్ నోటిఫికేషన్లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశముంది
  • ఖాళీలన్నింటినీ క్రోడీకరించి పరీక్షలు నిర్వహిస్తాం
  • 80 శాతం నియామకాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలనుకుంటున్నాం
  • మార్చి నాటికల్లా గ్రూప్ 2 నియామకాలు మొత్తం పూర్తవుతాయి.
  • ప్రభుత్వం సరేనంటే డిసెంబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం
  • గ్రూప్ 2కు ఇంటర్వ్యూలు తప్పనిసరిగా ఉంటాయి
  • ఇంతకుముందు జరిగిన లోపాలను సవరించి నియామకాలు చేపడతాం
  • నియామకాలు పారదర్శకంగా ఉంటాయి. ఆ విశ్వాసం ఉన్నవాళ్లే దరఖాస్తు చేయండి
  • ఇప్పటివరకు మేం చాలా ఫెయిర్గా వ్యవహరించాం. వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాం
  • ఏదైనా దాచిపెడితే వివాదం అవుతుంది.. మేం అంతా ఓపెన్గానే చేస్తున్నాం
  • ఎవరైనా అడ్డుకుంటే మాత్రం మేమేమీ చేయలేం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement