
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తూ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి సునితా సంపత్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాండూరు మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సునితా సంపత్ నామినేషన్ అన్నివిధాలుగా సక్రమంగా ఉన్నా తప్పుడు కారణాలతో నామినేషన్ రద్దు చేయడం దారుణమన్నారు.
మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఇంత నీచానికి దిగజారారని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణకు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈవీఎంల విషయంలో జిల్లా కలెక్టర్‌ను బలి చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు నెలల కాలంలోనే మరో కలెక్టర్‌ను బలిపీఠం ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని ఉత్తమ్ అన్నారు.