
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికలు నిర్వహించి ఉంటే ఫలితాలు మరోరకంగా ఉం డేవని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. జూలై 3 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాలపరిమితి ఉన్నా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్బుద్ధితో విపక్షాలను నిలువరించేందుకు ముందస్తుగా పరిషత్ ఎన్నికలు పెట్టిందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో 17 ఎంపీటీసీ స్థానాలు, ఖమ్మం జిల్లాలో 7, నల్లగొండ జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 3, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2, యాదాద్రి, మంచిర్యాల, సూర్యా పేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానం చొప్పున గెలుపొందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment