
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు బీజేపీలో చేరినట్టు చెప్పారు.
బీజేపీ ద్వారానే దళితులకు సామాజిక న్యాయం లభిస్తుందన్న నమ్మకంతో విద్యార్థి నేత గద్దల అంజిబాబు పార్టీలో చేరారని తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌కు చెందిన దళిత నేత రామలింగేశ్వరరావు బీజేపీలో చేరినట్టు వివరించారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యంపై అసంతృప్తితోనే దళిత నేతలు కమలదళంలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల ఎబీసీడీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment