తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడం సరికాదన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యవర్గం సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అందరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణలో మూడో విడత రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని మల్లు రవి చెప్పారు.