
'రాష్ట్ర భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం'
కేంద్ర భూసేకరణ చట్టం 2013కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని చాడ ఖండించారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. ఈ బిల్లును అమలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. బిల్లు సవరణపై రైతులు, వ్యవసాయ కార్మికులు వెంటనే నిరసనలకు దిగాలని పిలుపునిచ్చారు.
కేంద్ర చట్టానికి మెరుగైన సవరణలు తెస్తామని చెప్పి... అందుకు భిన్నంగా జీవో 123, 214లను పరోక్షంగా అమలు చేసేందుకు పూనుకోవడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర చట్టానికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకూ ఏమాత్రం పొంతన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్వాసిత ప్రజలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పునరావాస సౌకర్యాలు లేకుండా వారి బతుకులను బజారుపాలు చేయడం.. వారి గొంతు నొక్కడమే అవుతుందని ఆరోపించారు.